YSRCP: ముప్పాళ్ల పోలీసు స్టేషన్‌లో వైకాపా నేతల వీరంగం.. ఎస్సైకి గాయాలు

పల్నాడు జిల్లాలోని ముప్పాళ్ల పోలీసు స్టేషన్‌లో శుక్రవారం అర్ధరాత్రి వైకాపా నేతలు వీరంగం సృష్టించారు. వైకాపా నేతల దాడిలో ముప్పాళ్ల ఎస్సై కిషోర్‌కు గాయాలయ్యాయి.

Published : 02 Sep 2023 14:09 IST

ముప్పాళ్ల: పల్నాడు జిల్లాలోని ముప్పాళ్ల పోలీసు స్టేషన్‌లో శుక్రవారం అర్ధరాత్రి వైకాపా నేతలు వీరంగం సృష్టించారు. వైకాపా నేతల దాడిలో ముప్పాళ్ల ఎస్సై కిషోర్‌కు గాయాలయ్యాయి. తొలుత మద్యం మత్తులో వైకాపా నేత వెంకటేశ్వర్‌రెడ్డి కారుపై సాయి, కిషోర్ దాడి చేశారు. వైకాపా నేత ఫిర్యాదుతో వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై యువకులను అప్పగించాలంటూ అర్ధరాత్రి వైకాపా నేత అనుచరులు పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. స్టేషన్‌లోనే వారు సాయి, కిషోర్‌పై దాడి చేశారు.  అనుచరులను స్టేషన్‌ నుంచి బయటకు పంపేందుకు యత్నించిన ఎస్సైపై వైకాపా నేత వెంకటేశ్వర్‌ రెడ్డి దాడి చేశారు. ఈ ఘటనలో ఎస్సై కిషోర్‌ ముఖంతో పాటు చేతికి గాయాలయ్యాయి.

పోలీసులకే రక్షణ లేకపోతే ఎలా?: కన్నా

ఈ ఘటనపై మాజీ మంత్రి, తెదేపా నేత కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. రాష్ట్రంలో పోలీసులకే రక్షణ లేకపోతే ప్రజలకు రక్షణ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. దాడి చేసిన వైకాపా నాయకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని