భారత్‌ భారీ స్కోరు చేస్తేనే..

టీమ్‌ఇండియా భారీస్కోరు సాధిస్తే బౌలర్లే గెలిపిస్తారని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మార్క్‌ టేలర్‌ అభిప్రాయపడ్డాడు. బాక్సింగ్‌ డే టెస్టులో తొలుత బ్యాటింగ్‌ చేసి భారీస్కోరు సాధిస్తే టీమ్‌ఇండియా పుంజుకోవచ్చని...

Published : 26 Dec 2020 09:19 IST

మెల్‌బోర్న్‌: టీమ్‌ఇండియా భారీస్కోరు సాధిస్తే బౌలర్లే గెలిపిస్తారని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మార్క్‌ టేలర్‌ అభిప్రాయపడ్డాడు. బాక్సింగ్‌ డే టెస్టులో తొలుత బ్యాటింగ్‌ చేసి భారీస్కోరు సాధిస్తే టీమ్‌ఇండియా పుంజుకోవచ్చని అన్నాడు. అత్యుత్తమ పేస్‌ దశం ఉండటం టీమ్‌ఇండియాకు సానుకూలాంశమని తెలిపాడు. ‘‘భారీస్కోరు సాధిస్తే టీమ్‌ఇండియాకు మంచి అవకాశం ఉంటుంది. ఇప్పటికీ ఆ జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. కోహ్లి గైర్హాజరీతో బ్యాటింగ్‌ ఆర్డర్, నాయకత్వంలో తప్పకుండా లోటు ఏర్పడుతుంది. కాని పుజారా, రహానె వంటి అత్యుత్తమ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. భారీస్కోరు సాధిస్తే ప్రత్యర్థి జట్టును ఆలౌట్‌ చేయగల బౌలింగ్‌ దాడి టీమ్‌ఇండియా సొంతం. స్కోరు బోర్డుపై పరుగులు ఉంటే చాలు బౌలర్లు మిగతా పని పూర్తి చేస్తారు. మెల్‌బోర్న్‌లో మొదటి రోజు ఆట ఈ సిరీస్‌లో టీమ్‌ఇండియాకు అత్యంత
కీలకం’’ అని టేలర్‌ చెప్పాడు. 

ఇవీ చదవండి..

పంత్‌, సాహా.. ఇద్దరికీ అన్యాయమే జరిగింది

‘మైండ్‌ గేమ్‌’ ఆడితే ఆడనివ్వండి: రహానె

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని