Asia Cup 2023: ఆసియా కప్‌.. జట్టును ప్రకటించిన నేపాల్

ఆగస్ట్‌ 30 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు ఆసియా కప్‌ 2023 (Asia Cup 2023) జరగనుంది. 

Published : 14 Aug 2023 22:14 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆగస్ట్‌ 30 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు ఆసియా కప్‌ 2023 (Asia Cup 2023) జరగనుంది. ఈ టోర్నీ కోసం నేపాల్ తమ జట్టును ప్రకటించింది. ఆల్‌రౌండర్ రోహిత్‌ పౌడెల్ కెప్టెన్‌గా 17 మందిని ఎంపిక చేసింది. ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన సందీప్ లామిచానేకు కూడా అవకాశం లభించింది. జట్టు వివరాలను నేపాల్ క్రికెట్ అసోసియేషన్‌ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. నేపాల్ జట్టు త్వరలోనే పాకిస్థాన్‌కు వెళ్లనుంది. అక్కడ వారం రోజులపాటు సన్నాహక శిబిరాన్ని నిర్వహించనుంది. తర్వాత పీసీబీకి చెందిన జట్లతో మ్యాచ్‌లు ఆడుతుంది.

ఆరు దేశాలు పాల్గొనే ఈ మినీ టోర్నీ కోసం పాకిస్థాన్‌, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్నాయి. పాక్‌లో నాలుగు మ్యాచ్‌లు, శ్రీలంకలో తొమ్మిది మ్యాచ్‌లు జరగనున్నాయి. గ్రూప్‌ ఏలో భారత్‌, పాకిస్థాన్‌, నేపాల్‌ ఆడుతుండగా... గ్రూప్‌ బిలో బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌, శ్రీలంక ఆడనున్నాయి. గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లు ఆగస్టు 30 నుంచి మొదలవుతాయి. సూపర్‌ 4 మ్యాచ్‌లు సెప్టెంబరు 6 నుంచి ఉంటాయి. సెప్టెంబరు 17న ఫైనల్‌ మ్యాచ్‌ ఉంటుంది. పాకిస్థాన్‌తో సెప్టెంబరు 2న, నేపాల్‌తో సెప్టెంబరు 4న భారత్‌ మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ టోర్నీ కోసం భారత్ ఇంకా జట్టును ప్రకటించలేదు.

నేపాల్ జట్టు: 

రోహిత్ పౌడెల్ (కెప్టెన్‌), కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్ (వికెట్ కీపర్‌), భీమ్ షర్కి, కుశాల్ మల్లా, ఆరిఫ్ షేక్, దీపేంద్ర సింగ్ ఐరీ, గుల్షన్ ఝా, సోంపాల్ కమీ, కరణ్ కేసీ, సందీప్ లామిచానే, లలిత్ రాజ్‌బన్షి, ప్రతిష్ జీసీ, శ్యామ్ ధాకల్, జోరా, కిషోర్ మహతో, అర్జున్ సౌద్.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు