IND vs AUS : నాగ్‌పూర్‌ పిచ్‌పై ఆసీస్‌ అక్కసు.. భారత్‌కు అనుకూలమంటూ ఆరోపణలు

బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీ (Border Gavaskar Trophy) గురువారం నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్టు (Ind vs Aus) జరిగే నాగ్‌పూర్‌ (Nagpur Test) పిచ్‌పై ఆసీస్‌ మాజీలు ఆరోపణలు చేస్తూ తమ అక్కసు వెళ్లగక్కారు.

Updated : 08 Feb 2023 13:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రతిష్ఠాత్మక బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీ (Border Gavaskar Trophy) నేపథ్యంలో ఆస్ట్రేలియా, భారత్‌ జట్ల ఆటగాళ్ల మధ్య కవ్వింపులు, మాటల యుద్ధాలు సహజమే. ఈ సిరీస్‌లో తొలి టెస్టు (IND vs AUS) గురువారం నుంచి ప్రారంభం కానుండగా.. ఒక్కరోజు ముందు ఇక్కడి పిచ్‌లపై ఆస్ట్రేలియా టీమ్‌ నిపుణులు, ఆ జట్టు సభ్యుడు తమ అక్కసు వెళ్లగక్కారు. తొలి మ్యాచ్‌ జరిగే నాగ్‌పుర్‌ పిచ్‌ను ఆతిథ్య జట్టు తమకు అనుకూలంగా మార్చుకుంటోందని ఆరోపించారు.

మంగళవారం పిచ్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో కనిపించాయి. పిచ్‌ డ్రైగా ఉందని.. లెఫ్టార్మ్‌ స్పిన్నర్లకు ఎక్కువ సహకరించే అవకాశం ఉందని స్టీవ్‌ స్మిత్‌ పేర్కొన్నాడు. నాగ్‌పూర్‌ పిచ్‌ ఆస్ట్రేలియా లెప్ట్‌  హ్యాండర్లకు పరీక్షగా నిలుస్తుందని పలువురు సోషల్‌ మీడియాలో విశ్లేషిస్తున్నారు.ఇలాంటి పిచ్‌ల విషయంలో ఐసీసీ జోక్యం చేసుకోవాలని పలువురు ఆసీస్‌ మాజీలు కోరారు.

నాగ్‌పుర్‌ పిచ్‌పై వస్తున్న ఆరోపణలపై ఆసీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ సైమన్‌ ఓడానెల్‌ స్పందిస్తూ.. ‘‘ఈ పిచ్‌ విషయంలో ఏదైనా సరైనది కాదని భావిస్తే.. ఐసీసీ జోక్యం చేసుకొని పరిశీలించాలి’’ అని  అన్నాడు. అయితే, భారత్‌లో ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌ జరిగిన ప్రతిసారీ ఆతిథ్య జట్టుపై ఇలాంటి ఆరోపణలు చేయడం సహజమేనని పలువురు పేర్కొంటున్నారు. ఈ మేరకు భారత్‌ మాజీలు కూడా ఇటీవల కొన్ని కామెంట్స్‌ చేసిన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని