World Cup 2023: వరల్డ్ కప్‌ జట్టును ప్రకటించిన బంగ్లాదేశ్.. సీనియర్‌ ఆటగాడికి దక్కని చోటు

భారత్‌ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. జట్లను ప్రకటించడానికి మరో రెండు రోజులే గడువు ఉండటంతో బంగ్లాదేశ్ (Bangladesh) తమ జట్టు వివరాలను వెల్లడించింది.

Published : 26 Sep 2023 21:54 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. జట్లను ప్రకటించడానికి మరో రెండు రోజులే గడువు ఉండటంతో బంగ్లాదేశ్ (Bangladesh) తమ జట్టు వివరాలను వెల్లడించింది. దీంతో ప్రపంచకప్‌లో పోటీపడే 10 దేశాలు తమ జట్లను ప్రకటించినట్లయింది. షకీబ్‌ అల్ హసన్ కెప్టెన్‌గా 15 మంది ఆటగాళ్లతో జట్టును ఎంపిక చేసింది. నజ్ముల్ హుస్సేన్ శాంటో వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కీలకమైన పేసర్ ఎబాదత్‌ మోకాలి గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో వరల్డ్ కప్‌లో జట్టులోకి తీసుకోలేదు.

‘సూర్యను ప్రతి మ్యాచ్‌లో ఆడించాలి.. అతని కంటే బెటర్ ప్లేయర్‌ ఏ జట్టులోనూ లేడు’

తమీమ్‌ ఇక్బాల్‌కు షాక్‌ 

సీనియర్ బ్యాటర్, మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌ (Tamim Iqbal)ను ప్రపంచకప్‌ జట్టుకు ఎంపిక చేయలేదు. వెన్ను గాయం కారణంగా ఇటీవల ముగిసిన ఆసియా కప్‌నకు దూరమైన అతడు.. ఆ టోర్నీకి ముందే వన్డే కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. ప్రస్తుతం అతడు ఫిట్‌నెస్ సాధించినా వరల్డ్ కప్‌ జట్టులోకి తీసుకోలేదు. ఈ ఏడాది జులైలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన తమీమ్‌ ఒక్క రోజు వ్యవధిలోనే మనసు మార్చుకున్నాడు. బంగ్లా ప్రధానమంత్రి షేక్‌ హసీనా సలహా మేరకు అతడు వీడ్కోలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. 

బంగ్లాదేశ్ ప్రపంచ కప్ జట్టు: 

షకీబ్ అల్ హసన్ (కెప్టెన్‌), లిట్టన్ దాస్, తాంజిద్ హసన్ తమీమ్, నజ్ముల్ హొస్సేన్ శాంటో (వైస్‌ కెప్టెన్‌), తౌహిద్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా రియాద్, మెహిదీ హసన్ మిరాజ్, నసుమ్ అహ్మద్, షాక్ మహిది హసన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మన్‌, హసన్ మహముద్, షోరిఫుల్ ఇస్లాం, తంజిమ్ హసన్ సాకిబ్.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని