BCCI President Suggestions: ఆసీస్‌ను తేలిగ్గా తీసుకోవద్దు.. టైటిల్‌ మనదే : బీసీసీఐ అధ్యక్షుడు

కోట్లాది టీమ్‌ఇండియా అభిమానులు ఎదురుచూస్తున్న రోజు(ODI World Cup Final) రానే వచ్చింది. ప్రపంచకప్‌  తుది సమరంలో విజేతగా నిలిచి మూడోసారి దేశానికి టైటిల్‌ అందించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.

Updated : 19 Nov 2023 13:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ :  ప్రపంచకప్‌ టైటిల్‌ సాధించడానికి టీమ్‌ఇండియా (Team India) ఒక్క అడుగు దూరంలోనే ఉంది. కోట్లాది మంది చిరకాల కలను నెరవేర్చడానికి రోహిత్‌ సేన సిద్ధమైంది. ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్‌ వేదికగా ఫైనల్‌ మరికాసేపట్లో జరగనుంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన స్టేడియంలో లక్షలాది మంది అభిమానుల మధ్య సగర్వంగా ప్రపంచకప్‌ ట్రోఫీ(World Cup Trophy)ని ముద్దాడాలని ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నాడు.

మరోవైపు ఇదే సమయంలో ప్రత్యర్థి ఆస్ట్రేలియాను అంత తక్కువగా అంచనా వేయొద్దని.. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా టీమ్‌ఇండియా ఆడాలని పలువురు సూచిస్తున్నారు. ఫైనల్‌ పోరు ముందు బీసీసీఐ అధ్యక్షుడు (BCCI President) రోజర్‌బిన్నీ కూడా రోహిత్‌ సేనకు పలు సూచనలు చేశాడు.

ODI WC Final 2023: భారత్‌ vs ఆస్ట్రేలియా ఫైనల్‌ మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌

‘ఈ టోర్నీలో టీమ్‌ఇండియా మంచి క్రికెట్‌ ఆడింది. ఇప్పటి వరకూ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో గెలిచాం. భారత్‌ ఎంతో గొప్ప ప్రదర్శన చేసింది. అయితే.. ఆస్ట్రేలియాను తేలికగా తీసుకోవద్దు. వాళ్లు కూడా బాగా ఆడుతున్నారు. ఇప్పటికే ఐదు సార్లు ఛాంపియన్లుగా నిలిచారు. భారతే టైటిల్‌ గెలుస్తుందని ఆశిస్తున్నాను’ అని రోజర్‌బిన్నీ (Roger Binny) తెలిపాడు.

ఇక నేడు ప్రపంచకప్‌ తుది సమరం (World Cup 2023 Final) నేపథ్యంలో.. దేశమంతా ఫైనల్‌ ఫీవర్‌ పాకింది. ఎక్కడ చూసిన ఫైనల్‌పైనే చర్చ కొనసాగుతోంది. మరోవైపు భారత్‌ టైటిల్‌ గెలవాలని అభిమానులు పలుచోట్ల ప్రార్థనలు, పూజలు నిర్వహిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని