MS Dhoni-CSK: ధోనీ భవిష్యత్‌పై స్పందించిన సీఎస్కే బౌలర్‌..

చెన్నై (Chennai Super Kings) సారథి ఎంఎస్‌ ధోనీ భవితవ్యంపై ఆ జట్టు బౌలర్‌ దీపక్‌ చాహర్‌ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

Published : 06 Mar 2024 19:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  క్రికెట్‌ అభిమానులను అలరించేందుకు ఐపీఎల్‌ 17 (IPL 2024)వ సీజన్‌ సిద్ధమవుతోంది. మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ కోసం అన్ని జట్లూ ప్రాక్టీస్‌ మొదలుపెట్టాయి. ఎప్పటిలానే చెన్నై (Chennai Super Kings) సారథి ఎంఎస్‌ ధోనీ (MS Dhoni) భవితవ్యంపై చర్చ కూడా ప్రారంభమైంది. ఇదే అతడికి ఆఖరి సీజనా..?అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. ఈనేపథ్యంలో ఆ జట్టు బౌలర్‌ దీపక్‌ చాహర్‌ ఈ అంశంపై స్పందించాడు.

‘‘గత ఏడాది 145 కి.మీ. వేగంతో వచ్చిన బంతులను ధోనీ ఎలా సిక్స్‌లుగా మలిచాడో మీరు చూశారు. మేం దానిని నెట్స్‌లోనూ చూస్తాం. ధోనీ ఈ ఏడాది ఆడతాడు. ఈ సీజన్‌ అనంతరం అతడు నిర్ణయం తీసుకోవచ్చు. అయితే.. మరో రెండేళ్లు ఆడతాడని నేను అనుకుంటున్నాను’ అని చాహర్‌ పేర్కొన్నాడు.

ధర్మశాలలో పడిక్కల్‌ అరంగేట్రం చేసేనా?

కొత్త సీజన్‌.. డబుల్‌ రోల్‌

ఈ ఐపీఎల్‌ సీజన్‌ కోసం ధోని మంగళవారం చెన్నైలో అడుగుపెట్టాడు. మహీ ఫొటోను సామాజిక మాధ్యమంలో పంచుకున్న సీఎస్కే ఫ్రాంఛైజీ.. ‘తలా దర్శనం’ అనే శీర్షిక పెట్టింది. ‘కొత్త సీజన్‌.. కొత్త పాత్ర కోసం ఎదురుచూస్తున్నా’ అని తాజాగా ఎంఎస్‌డీ పెట్టిన పోస్టు వైరల్‌ అవుతోంది. దీనిపై తాజాగా ధోనీయే వివరణ ఇచ్చాడు. ‘కొత్త సీజన్‌.. డబుల్‌ రోల్‌’ అంటూ బుధవారం ఫేస్‌బుక్‌ పోస్టులో వీడియో పంచుకున్నాడు. అయితే.. ఈ వీడియో ఐపీఎల్‌ ప్రమోషన్‌ కోసం తీసింది కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని