CSK: బుర్జ్ దగ్గర్లో బస.. ఫ్యామిలీకి ప్రవేశం లేదు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020కి చెన్నై సూపర్‌కింగ్స్ శరవేగంగా సిద్ధమవుతోంది. యూఏఈకి వెళ్లేందుకు అవసరమైన పనులన్నీ చకచకా చేసేస్తోంది. దుబాయ్‌లో నిర్వహించే శిబిరం ఏర్పాట్లనీ పూర్తి చేసినట్టే కనిపిస్తోంది. అన్నీ సవ్యంగా సాగితే ఆగస్టు 19న ఆటగాళ్లు, సిబ్బంది మొత్తం....
ఇంటర్నెట్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020కి చెన్నై సూపర్‌కింగ్స్ శరవేగంగా సిద్ధమవుతోంది. యూఏఈకి వెళ్లేందుకు అవసరమైన పనులన్నీ చకచకా చేసేస్తోంది. దుబాయ్‌లో నిర్వహించే శిబిరం ఏర్పాట్లనీ పూర్తి చేసినట్టే కనిపిస్తోంది. అన్నీ సవ్యంగా సాగితే ఆగస్టు 19న ఆటగాళ్లు, సిబ్బంది మొత్తం చెన్నైలో కలుసుకుంటారు. అక్కడ్నుంచి ఛార్టెడ్ విమానంలో యూఏఈకి చేరుకుంటారు.
దుబాయ్‌లోని బుర్జ్ ఖలీపా సమీపంలోని ఓ ఐదు నక్షత్రాల హోటల్లో రెండు ఫ్లోర్లను సీఎస్కే బుక్ చేసిందని సమాచారం. ఈ రెండింటిలో చెన్నై ఆటగాళ్లు, సిబ్బంది తప్ప మరొకరు ఉండరు. వీటికి సంబంధించిన ఎయిర్ కండిషనింగ్ విభాగం సైతం ప్రత్యేకంగా ఉంటుందట. కుటుంబ సభ్యుల అనుమతి బాధ్యతలన్నీ ఫ్రాంచైజీలకే బీసీసీఐ అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే కుటుంబీకులు వచ్చినా విడిగా ఉండాలి. భౌతిక దూరం పాటించాలి. కలుసుకోవడం, బయో బుడగను దాటేందుకు వీల్లేదు. అందుకే చెన్నై ఆటగాళ్లు భార్యా పిల్లల్ని తీసుకెళ్లడం లేదని అంటున్నారు!
కరీబియన్ ప్రీమియర్ లీగ్, వన్డే సిరీసుల వల్ల కొందరు ఆటగాళ్లు చెన్నై శిబిరంలో పాల్గొనడం అనుమానమే. సెప్టెంబర్ 12న సీపీఎల్ ఫైనల్ జరుగుతుంది. అప్పటి వరకు డ్వేన్ బ్రావో, మిచెల్ శాంట్నర్, ఇమ్రాన్ తాహిర్ అందుబాటులో ఉండరు. ఐపీఎల్ 19న ప్రారంభం అవుతున్నప్పటికీ క్వారంటైన్ నిబంధనలు, టెస్టులన్నీ చూసుకుంటే ప్రథమార్ధం వరకు వారికి అవకాశం లేదు. ద్వైపాక్షిక సిరీసులతో యువ ఆల్‌రౌండర్ సామ్ కరణ్, జోష్ హేజిల్‌వుడ్ రాకపోవచ్చు. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వాట్సన్, దక్షిణాఫ్రికా క్రికెటర్లు డుప్లెసిస్, లుంగి ఎంగిడి నేరుగా దుబాయ్‌కే వస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
చెన్నై జట్టుకు గాయాలు ఇబ్బందిగా మారాయి. యువ పేసర్ పతిరన గాయం కారణంగా స్వదేశానికి వెళ్లిపోయాడు. -
డోపింగ్ శాంపిల్‌కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
డోపింగ్ పరీక్షకు శాంపిల్ ఇవ్వని కారణంగా రెజ్లర్ బజరంగ్ పునియాపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) సస్పెన్షన్ వేటు వేసింది. -
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
ఐపీఎల్ 17వ సీజన్లో సిరాజ్ తొలిసారి అత్యుత్తమ బౌలింగ్‌తో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాడు. బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు. -
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
క్రికెట్ అభిమానులను అలరించడానికి ప్రతి దేశం ఓ లీగ్‌ను నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే భారత్‌లో ఐపీఎల్, పాక్‌లో పీఎస్ఎల్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే, వచ్చే ఏడాది ఈ రెండు ఒకే సమయంలో జరిగే అవకాశం ఉంది. -
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
బెంగళూరు చేతిలో ఓటమితో గుజరాత్ కూడా ప్లేఆఫ్స్ అవకాశాలను దాదాపు దూరం చేసుకుంది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. -
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్‌కు తప్పని బాడీ షేమింగ్
భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్‌కు సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ ఎదురైంది. అతడూ ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. -
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్‌రౌండర్‌గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్‌లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్‌రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్‌సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్‌పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్‌తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్‌తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్‌బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్‌గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్‌కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్‌కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
నిండు గర్భిణిపై వైకాపా నాయకుల దాడి
-
‘డ్రగ్స్ ఇచ్చి.. నన్ను లైంగికంగా వేధించారు’..: మహిళా మంత్రి
-
సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం
-
12 గంటలపాటు కాల్పులు.. హమాస్ ‘వెస్ట్‌బ్యాంక్’ కమాండర్ హతం!
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన