ఆర్‌సీబీ అభిమానులకు చేదువార్త

రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు అభిమానులకు చేదు వార్త. ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్ 14వ సీజన్‌కు దూరమవుతున్నట్లు దక్షిణాఫ్రికా పేసర్‌ డేల్ స్టెయిన్ ప్రకటించాడు. అయితే పోటీ క్రికెట్‌...

Published : 03 Jan 2021 02:00 IST

ఇంటర్నెట్‌డెస్క్: రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు అభిమానులకు చేదు వార్త. ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్ 14వ సీజన్‌కు దూరమవుతున్నట్లు దక్షిణాఫ్రికా పేసర్‌ డేల్ స్టెయిన్ ప్రకటించాడు. అయితే పోటీ క్రికెట్‌ నుంచి తాను తప్పుకోవట్లేదని, కాస్త విరామం మాత్రమే తీసుకుంటున్నట్లు తెలిపాడు.

‘‘ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి అందుబాటులో ఉండట్లేదు. అలా అని ఇతర జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు కాదు. కాస్త విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నా’’ అని స్టెయిన్ ట్వీట్ చేశాడు. అయితే ఐపీఎల్‌కు దూరమవుతున్నా ఇతర లీగ్‌ల్లో ఆడతానని స్టెయిన్ మరో ట్వీట్‌లో తెలిపాడు. ఎంతో ప్రేమించే క్రికెట్‌ను కొనసాగించాలనుకుంటున్నానని, ఆటకు వీడ్కోలు పలకట్లేదని స్పష్టం చేశాడు. కాగా, స్టెయిన్‌ ట్వీట్‌పై ఆర్‌సీబీ స్పందించింది. ‘మమ్మల్ని మిస్ అవుతారు. ఎన్నో జ్ఞాపకాలు అందించినందకు కృతజ్ఞతలు. మాకు మద్దతుగా ఉండండి’ అని ట్వీటింది.

బంతుల్ని బుల్లెట్లా విసిరే స్టెయిన్‌ వచ్చే సీజన్‌కు దూరమవ్వడం ఆర్‌సీబీకి ప్రతికూలాంశమే. అయితే గత సీజన్‌లో స్టెయిన్‌ నిరాశపరిచాడు. మూడు మ్యాచ్‌లు ఆడిన అతడు భారీగా పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ మాత్రమే తీశాడు. కానీ అతడి అనుభవం యువపేసర్లకు ఎంతో ఉపయోగపడింది. ప్రాక్టీస్‌ సెషన్లలో యువ బౌలర్లకు అతడు మార్గనిర్దేశం చేశాడు. ఐపీఎల్‌లో 95 మ్యాచ్‌లు ఆడిన స్టెయిన్‌ 97 వికెట్లు పడగొట్టాడు. కాగా, ఇప్పటివరకు కోహ్లీసేన టైటిల్‌ను ఒక్కసారి కూడా అందుకోని విషయం తెలిసిందే.

ఇదీ చదవండి

‘అంపైర్‌ కాల్’‌ను నిషేధించండి

బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీకి గుండెపోటు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని