Rohit Sharma: వైస్ కెప్టెన్సీని తొలగించడం పెద్ద విషయం కాదు: రోహిత్‌ శర్మ

కేఎల్‌ని రాహుల్‌ (KL Rahul)ని వైస్‌ కెప్టెన్సీ నుంచి తప్పించడంపై గురించి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) మాట్లాడాడు. 

Published : 28 Feb 2023 15:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్: భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) కొంతకాలంగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు. బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీలో ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుల్లోనూ విఫలమయ్యాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 38 పరుగులే చేశాడు. ఈ క్రమంలో మొదటి రెండు టెస్టులకు వైస్‌ కెప్టెన్‌గా ఉన్న అతడిని మిగిలిన రెండు టెస్టులకు ఆ బాధ్యతల నుంచి తప్పించి ఆటగాడిగా జట్టులో చోటు కల్పించారు. ఫామ్‌లో లేని కేఎల్‌ రాహుల్‌ని తుది జట్టు నుంచి తప్పించి అతడి స్థానంలో సూపర్‌ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill)ని తీసుకోవాలని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ని వైస్‌ కెప్టెన్‌ పదవి నుంచి తొలగించడం గురించి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ( Rohit Sharma)ను ఆసీస్‌తో మూడో టెస్టు ప్రారంభానికి ముందు జరిగిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో అడిగారు.

‘జట్టులోని మొత్తం 17 మంది ఆటగాళ్లకు అవకాశం ఉంది. ప్రతిభావంతులైన వారికి జట్టు మద్దతు ఇస్తుంది. వైస్ కెప్టెన్సీని తొలగించడం అనేది పెద్ద విషయం కాదు. ఆ సమయంలో (కేఎల్‌ రాహుల్‌ని వైస్‌ కెప్టెన్‌గా నియమించినప్పుడు) ఎక్కువ అనుభవం ఉన్న ఆటగాళ్లు లేరు. అందుకే కేఎల్ రాహుల్‌ని వైస్ కెప్టెన్‌గా చేశారు. ఇదేమి పెద్ద విషయం కాదు’ అని రోహిత్‌ శర్మ వివరించాడు. బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీలో వరుసగా రెండు టెస్టుల్లో ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్‌.. మూడో టెస్టులోనూ కంగారులను ఓడించి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ (WTC Final) బెర్తుని ఖాయం చేసుకోవాలని ఆశిస్తోంది. మార్చి 1 నుంచి ఇండోర్‌ వేదికగా మూడో టెస్టు ప్రారంభంకానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని