ఐఎస్‌ఎల్‌ ఛాంప్‌ ఏటీకే

ఏటీకే మోహన్‌బగాన్‌ కల తీరింది. పట్టుదల ప్రదర్శించిన ఆ జట్టు  ఐఎస్‌ఎల్‌ సీజన్‌-9 టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. శనివారం పెనాల్టీ షూటౌట్లో ఏటీకే 4-3 గోల్స్‌తో బెంగళూరు ఎఫ్‌సీని ఓడించి తొలిసారి విజేతగా నిలిచింది.

Published : 19 Mar 2023 02:16 IST

మార్గోవా: ఏటీకే మోహన్‌బగాన్‌ కల తీరింది. పట్టుదల ప్రదర్శించిన ఆ జట్టు  ఐఎస్‌ఎల్‌ సీజన్‌-9 టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. శనివారం పెనాల్టీ షూటౌట్లో ఏటీకే 4-3 గోల్స్‌తో బెంగళూరు ఎఫ్‌సీని ఓడించి తొలిసారి విజేతగా నిలిచింది. నిర్ణీత సమయంలోపు రెండు జట్లూ 2-2తో సమంగా నిలిచాయి. దిమిత్రి (14వ ని) గోల్‌తో ఏటీకే ఆధిక్యంలోకి వెళ్లగా.. సునీల్‌ ఛెత్రి (50వ), రాయ్‌ కృష్ణ (78వ) బంతిని నెట్‌లోకి పంపడంతో బెంగళూరు గెలుపు దిశగా సాగింది. కానీ ఆట చివర్లో దిమిత్రి (85వ) పెనాల్టీని గోల్‌గా మలచడంతో స్కోర్లు ఒకటయ్యాయి. అదనపు సమయంలోనూ రెండు జట్లూ సఫలం కాకపోవడంతో మ్యాచ్‌ షూటౌట్‌కు వెళ్లింది. తొలి రెండు ప్రయత్నాల్లో ఏటీకే, బెంగళూరు గోల్స్‌ కొట్టాయి. మూడో ప్రయత్నంలో రమైర్స్‌ (బెంగళూరు) షాట్‌ని ఏటీకే గోల్‌కీపర్‌ విశాల్‌ అడ్డుకున్నాడు. ఆపై కియాన్‌ స్కోరు చేయడంతో ఏటీకే 3-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత నాలుగో షాట్‌ను ఛెత్రి (బెంగళూరు) సద్వినియోగం చేసి స్కోరు 3-3తో సమం చేసినా.. ఆ వెంటనే మన్వీర్‌ బంతిని నెట్‌లోకి పంపడంతో మోహన్‌బగాన్‌ మళ్లీ 4-3తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆపై పెరిజ్‌ (బెంగళూరు) విఫలం కావడంతో ఏటీకే సంబరాల్లో మునిగిపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని