UAE vs NZ: టీ20లో పసికూన యూఏఈ సంచలనం

టీ20ల్లో మరో పసికూన.. పెద్ద జట్టుకు షాకిచ్చింది. శనివారం యూఏఈ 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. 

Updated : 20 Aug 2023 09:23 IST

దుబాయ్‌: టీ20ల్లో మరో పసికూన.. పెద్ద జట్టుకు షాకిచ్చింది. శనివారం యూఏఈ 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. మూడు టీ20ల సిరీస్‌ తొలి మ్యాచ్‌లో ఓడిన ఆ జట్టు.. రెండో టీ20లో కివీస్‌ను అలవోకగా ఓడించింది. మొదట అయాన్‌ అఫ్జల్‌ ఖాన్‌ (3/20), జవాదుల్లా (2/16), అలీ నజీర్‌ (1/25)ల ధాటికి కివీస్‌ 142/8కు పరిమితమైంది. ఒక దశలో 65/5తో నిలిచిన కివీస్‌.. చాప్‌మన్‌ (63; 46 బంతుల్లో 3×4, 3×6) పోరాడకుంటే ఆమాత్రం స్కోరు కూడా చేసేది కాదు. మహ్మద్‌ వసీమ్‌ (55; 29 బంతుల్లో 4×4, 3×6), అసిఫ్‌ ఖాన్‌ (48 నాటౌట్‌; 29 బంతుల్లో 5×4, 1×6) చెలరేగడంతో లక్ష్యాన్ని యూఏఈ 15.4 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి ఛేదించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని