Shubman Gill: కోహ్లి స్ఫూర్తితోనే

పరుగుల కోసం విరాట్‌ కోహ్లి తపించే తీరే తనకు స్ఫూర్తి అని యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ అన్నాడు. ‘‘కోహ్లి మైదానంలోకి వచ్చిన ప్రతిసారి ఏదో ప్రత్యేకత చూపిస్తాడు.

Updated : 17 Nov 2023 05:36 IST

ముంబయి: పరుగుల కోసం విరాట్‌ కోహ్లి తపించే తీరే తనకు స్ఫూర్తి అని యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ అన్నాడు. ‘‘కోహ్లి మైదానంలోకి వచ్చిన ప్రతిసారి ఏదో ప్రత్యేకత చూపిస్తాడు. గత 15 ఏళ్లుగా అతడు స్థిరంగా రాణిస్తున్నాడు. కేవలం ఇది నైపుణ్యం వల్ల మాత్రమే సాధ్యం కాలేదు. పరుగుల కోసం అతడు తపించే విధానమే ప్రత్యేకం. ఇదే బ్యాటింగ్‌లో నాకు స్ఫూర్తి. రోహిత్‌ బ్యాటింగ్‌లో ప్రతి అంశం ఆకట్టుకుంటుంది. పవర్‌ప్లేలో క్రీజుకు మరోవైపు నేను విద్యార్థిలా మారిపోతాను. ఒక్కోసారి 10 ఓవర్లు పూర్తయితే నేను 15-20 బంతులు మాత్రమే ఎదుర్కొంటా. అంతా రోహిత్‌ చూసుకుంటాడు’’ అని గిల్‌ చెప్పాడు. భారత పేసర్లను నెట్స్‌లోనూ ఆడడం కష్టమని శుభ్‌మన్‌ చెప్పాడు. ‘‘టీమ్‌ఇండియా పేసర్లను నెట్స్‌లోనూ కష్టంగా ఎదుర్కొంటాం. బుమ్రా, షమి, సిరాజ్‌ కూడా మాకు బౌలింగ్‌ చేయడాన్ని ఆస్వాదిస్తారు. ఓ సవాల్‌గా తీసుకుంటారు’’ అని గిల్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని