Suryakumar Yadav: బెదురు లేకుండా ఆడా

ఆస్ట్రేలియాతో తొలి టీ20లో బెదురు లేకుండా ఆడానని తాత్కాలిక కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ చెప్పాడు. ఇషాన్‌కిషన్‌ నుంచి చక్కటి సహకారం లభించిందని తెలిపాడు. ఆసీస్‌ 42 బంతుల్లోనే 80 పరుగులు చేసి జట్టును గెలిపించిన నేపథ్యంలో అతడిలా అన్నాడు. ‘‘తొలి టీ20లో బెదురు లేకుండా ఆడా. ఇషాన్‌ నుంచి మంచి సహకారం లభించింది. నేను భారీ షాట్లు ఆడుతుంటే అతడు మద్దతు ఇస్తూనే ఇంకోవైపు బాదాడు.

Updated : 25 Nov 2023 07:57 IST

విశాఖపట్నం: ఆస్ట్రేలియాతో తొలి టీ20లో బెదురు లేకుండా ఆడానని తాత్కాలిక కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(Suryakumar Yadav) చెప్పాడు. ఇషాన్‌కిషన్‌ నుంచి చక్కటి సహకారం లభించిందని తెలిపాడు. ఆసీస్‌ 42 బంతుల్లోనే 80 పరుగులు చేసి జట్టును గెలిపించిన నేపథ్యంలో అతడిలా అన్నాడు. ‘‘తొలి టీ20లో బెదురు లేకుండా ఆడా. ఇషాన్‌ నుంచి మంచి సహకారం లభించింది. నేను భారీ షాట్లు ఆడుతుంటే అతడు మద్దతు ఇస్తూనే ఇంకోవైపు బాదాడు. ఇషాన్‌ ఇన్నింగ్స్‌ చాలా కీలకం. రింకూ సింగ్‌ ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఆడాడు. అతడు  తొణక్కుండా బ్యాటింగ్‌ చేయడం గొప్పగా అనిపించింది. 200పైన లక్ష్యాన్ని చేధిస్తే కచ్చితంగా అది ఎంతో ఆస్వాదించే విజయమవుతుందని డ్రెస్సింగ్‌రూమ్‌లో అందరం అనుకున్నాం. జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం.. తొలి మ్యాచ్‌లోనే బ్యాట్‌తోనూ రాణించడం గర్వంగా అనిపిస్తోంది’’ అని సూర్య తెలిపాడు.


సాధన వల్లే సాధ్యమైంది

ప్రపంచకప్‌లో ఎక్కువ సమయం రిజర్వ్‌ బెంచ్‌లో ఉన్నప్పుడు సాధనపైనే దృష్టి సారించానని.. వీలైనంతగా కోచ్‌లతో మాట్లాడుతూ లోపాలు దిద్దుకున్నానని యువ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ చెప్పాడు. ‘‘ప్రపంచకప్‌లో మ్యాచ్‌లు ఆడని సమయంలో ప్రతి ప్రాక్టీస్‌ సెషన్లోనూ పాల్గొన్నా. ఆటను ఎలా మెరుగుపరుచుకోవాలో... ఏం చేయాలో ఆలోచించా. నెట్స్‌లో బాగా కష్టపడ్డా. కొంతమంది బౌలర్లను ఎలా లక్ష్యంగా చేసుకుని ఆడాలో కోచ్‌లతో తరుచూ మాట్లాడా. ఆస్ట్రేలియాతో తొలి టీ20లో ఈ ప్రణాళికను అమలు చేశా. ఈ మ్యాచ్‌లో 20 ఓవర్లు కీపింగ్‌ చేయడం వల్ల పిచ్‌ పరిస్థితి అర్థమైంది. ఐపీఎల్‌లో సూర్య భాయ్‌తో కలిసి ఆడిన అనుభవం పనికొచ్చింది. అతడెలా బ్యాటింగ్‌ చేస్తాడో. ఎలాంటి షాట్లు కొడతాడో అవగాహన ఉంది. 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్నప్పుడు ఏ బౌలర్‌ని లక్ష్యంగా చేసుకోవాలో నిర్ణయించుకోవాలి. దీనికి తోడు ఆరంభంలోనే రెండు వికెట్లు పడ్డాయి. అందుకే స్పిన్నర్‌ తన్వీర్‌ సంఘా బౌలింగ్‌లో దూకుడుగా ఆడా. తర్వాత వచ్చే బ్యాటర్లకు ఎక్కువ లక్ష్యాన్ని ఉంచకూడదన్న లక్ష్యంతో సాహసోపేతమైన షాట్లు ఆడా’’ అని ఇషాన్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని