Mumbai Indians: అందుకే రోహిత్‌ స్థానంలో హార్దిక్‌.. అసలు కారణం చెప్పిన ముంబయి ఇండియన్స్‌ కోచ్‌

Mumbai Indians: ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ స్థానంలో హార్దిక్‌ పాండ్యను నియమించడంపై ఆ జట్టు కోచ్‌ అసలు కారణాన్ని బయటపెట్టారు. దీన్ని భావోద్వేగాలతో ముడిపెట్టొద్దని కోరారు.

Published : 06 Feb 2024 13:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians) కెప్టెన్సీ మార్పు నిర్ణయం క్రికెట్‌లో పెను తుపాను సృష్టించిన విషయం తెలిసిందే. జట్టుకు ఐదు టైటిళ్లను అందించిన రోహిత్ శర్మకు (Rohit Sharma) బదులు హార్దిక్‌ పాండ్య (Hardik Pandya)ను సారథిగా నియమించడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. దీంతో ఆ ఫ్రాంఛైజీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ అంశంపై జట్టు కోచ్‌ మార్క్‌ బోచర్‌ స్పందిస్తూ మార్పు వెనుక అసలు కారణాన్ని వెల్లడించారు.

ఓ క్రీడాఛానల్‌ పాడ్‌కాస్ట్‌లో కోచ్‌ మార్క్‌ దీనిపై మాట్లాడారు. ‘‘ఇది పూర్తిగా ఆటపరంగా తీసుకున్న నిర్ణయమే. నా వరకు ఇదో పరివర్తన దశ మాత్రమే. చాలా మందికి ఈ విషయం అర్థంగాక, భావోద్వేగానికి గురయ్యారు. కానీ, ఆటకు సంబంధించిన విషయాల్లో ఉద్వేగాలను పక్కనబెట్టాలి. ఓ ఆటగాడిగా రోహిత్‌ నుంచి మరింత అత్యుత్తమ ప్రదర్శన చూసేందుకు ఈ నిర్ణయం మేలుచేస్తుంది. అతడు మరింత స్వేచ్ఛతో ఆడి మంచి పరుగులు సాధించనివ్వండి’’ అని తెలిపారు.

భారత్‌ను వీడనున్న ఇంగ్లాండ్‌ క్రికెటర్లు కారణం ఇదే..

ఇక, ఐపీఎల్‌లో క్రికెటేతర బాధ్యతలు కూడా కెప్టెన్సీ మార్పునకు మరో కారణమని మార్క్‌ వెల్లడించారు. ‘‘గత రెండు ఐపీఎల్‌ సీజన్లలో రోహిత్‌ బ్యాట్‌తో రాణించలేకపోయాడు. అందుకే అతడి భుజాలపై బాధ్యతలను తగ్గించాలనుకున్నాం. లీగ్‌ టోర్నీలో కెప్టెన్‌కు ఆట కాకుండా చాలా బాధ్యతలుంటాయి. ఫొటోషూట్స్‌, ప్రకటనల వంటివి కూడా చూసుకోవాలి’’ అని మార్క్‌ వెల్లడించారు.

కాగా.. ఈ పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూపై రోహిత్‌ శర్మ సతీమణి రితికా విమర్శనాత్మక పోస్ట్ చేశారు. ‘‘దీని వల్ల చాలా తప్పిదాలు జరిగాయి’’ అంటూ ఆమె పేర్కొనడం చర్చకు దారితీసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని