WPL 2024: యూపీ వారియర్స్‌ చిత్తు.. ప్రతీకారం తీర్చుకున్న ముంబయి

మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (WPL 2024)లో భాగంగా యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ 42 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది.

Published : 07 Mar 2024 22:49 IST

దిల్లీ: మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (WPL 2024)లో భాగంగా యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ 42 పరుగుల తేడాతో సూపర్‌ విక్టరీ సాధించింది. ఈ గెలుపుతో గత మ్యాచ్‌లో యూపీ చేతిలో ఎదురైన పరాభావానికి ముంబయి ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 రన్స్‌ చేసింది. లక్ష్యఛేదనలో యూపీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులకు పరిమితమైంది. దీప్తి శర్మ (53*; 36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా మిగతా బ్యాటర్లు ఆకట్టుకోలేకపోయారు. శ్వేతా సెహ్రావత్ (17), గ్రేస్‌ హారిస్‌ (15) పరుగులు చేశారు. టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లు అలీసా హీలే (3), కిరణ్ నవ్‌గిరే (7), చమరి ఆటపట్టు (3) సింగిల్ డిజిట్‌ స్కోరుకే పరిమితమయ్యారు. ముంబయి బౌలర్లలో సైకా ఇషాక్‌ 3, నాట్ సీవర్‌ 2, షబ్నిమ్‌, హేలీ మాథ్యూస్, పుజా వస్త్రాకర్‌, సజనా ఒక్కో వికెట్ పడగొట్టారు. 

అంతకుముందు ముంబయి బ్యాటర్లలో నాట్ సీవర్ (45; 31 బంతుల్లో 8 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడింది. హర్మన్‌ప్రీత్ కౌర్‌ (33; 30 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించింది. చివర్లో అమేలియా కెర్‌ (39; 23 బంతుల్లో 6 ఫోర్లు), సజనా (22*; 14 బంతుల్లో 4 ఫోర్లు) దూకుడుగా ఆడారు. యూపీ బౌలర్లలో చమరి ఆటపట్టు 2, రాజేశ్వరి గైక్వాడ్, దీప్తి శర్మ, సైమా ఠాకూర్‌ ఒక్కో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని