Nepal Cricket: కార్డియాక్ కిడ్స్... వీళ్ల స్ట్రోక్‌లు మామూలుగా ఉండవ్!
క్రికెట్లో నేపాల్ (Nepal Cricket Team) అనగానే పసికూన అనే అంతా అనుకుంటారు. కానీ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు బాదింది అంటే నమ్ముతారా? అంతేకాదు ఆ మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ, ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కూడా ఉన్నాయంటే నమ్ముతారా? కానీ ఆ జట్టు చేసింది, చేసి చూపించింది.
క్రికెట్లో నేపాల్ (Nepal Cricket Team) అనగానే పసికూన అనే అంతా అనుకుంటారు. కానీ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు బాదింది అంటే నమ్ముతారా? అంతేకాదు ఆ మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ, ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కూడా ఉన్నాయంటే నమ్ముతారా? కానీ ఆ జట్టు చేసింది, చేసి చూపించింది. ఆసియా గేమ్స్‌లో భాగంగా మంగోలియా మీద ఈ ఘనత సాధించారు. అంతకుమందు ఆసియా కప్‌లో టీమ్ ఇండియాకు చెమటలు పట్టించారు. కార్డియాక్ కిడ్స్ అని తమ జట్టుకు ఎందుకు పేరు వచ్చిందో మరోసారి అర్థమయ్యేలా చేశారు.
ఆసియా క్రీడల్లో నేపాల్ బ్యాట్స్‌మెన్ దీపేంద్రసింగ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. కేవలం తొమ్మిది బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. దీంతో టీ20ల్లో యువరాజ్ సింగ్ (12 బంతుల్లో 50) రికార్డు బద్దలైంది. ఆసియా గేమ్స్‌లో భాగంగా మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో దీపేంద్ర సింగ్ ఈ ఘనతను సాధించాడు. ఇదే మ్యాచ్‌లో 314/3తో టీ20 చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేశారు. నేపాల్ బ్యాటర్ కుషాల్ మల్ల 34 బంతుల్లో వంద పరుగులు రికార్డూ సృష్టించాడు. ఆసియా కప్ (Asia Cup 2023) మ్యాచ్‌లో వన్డే ఫార్మాట్‌లో నేపాల్ ఏకంగా 230 పరుగులు చేసింది. భారత బౌలర్లను ఆ జట్టు బ్యాటర్లు అలవోకగా ఎదుర్కొన్నారు. ఆ జట్టు ఆటగాళ్లలో భయమన్నదే కనిపించలేదు. ఈ మ్యాచ్‌లో నేపాల్ చివరికి చిత్తుగానే ఓడినా.. వారి ప్రదర్శన మాత్రం ఆకట్టుకుంది.
టీ20ల్లో చరిత్ర సృష్టించిన నేపాల్.. ఆసియా క్రీడల్లో రికార్డుల మోత
ప్రపంచ క్రికెట్లో ప్రతి జట్టుకూ ఒక నిక్ నేమ్ ఉంటుంది. భారత జట్టును ‘మెన్ ఇన్ బ్లూ’ అన్నట్లుగా.. నేపాల్ జట్టుకు కూడా ఒక పేరుంది. అదే.. కార్డియాక్ కిడ్స్. ఇదేం పేరు అని ఆశ్చర్యం కలగడం ఖాయం. కార్డియాక్ అంటే గుండె సంబంధిత పదం అన్న సంగతి తెలిసిందే. మరి క్రికెట్ జట్టు పేరులో ఈ పదం ఎందుకు ఉంది అంటే? తమతో తలపడే ప్రత్యర్థులకు గుండెపోటు తెప్పిస్తారనే ఉద్దేశంతోనే ఆ జట్టుకు ఆ పేరు పెట్టారు. అసోసియేట్ దేశాలతో జరిగిన అనేక టోర్నీలు, మ్యాచ్‌ల్లో నేపాల్ అలాంటి సంచలన ప్రదర్శనే చేసింది. తనకంటే మెరుగైన జట్లకు ఎన్నోసార్లు షాకులిచ్చింది. అందుకే ఆ జట్టు ఆటగాళ్లకు ‘కార్డియాక్ కిడ్స్’ అనే పేరు పెట్టారు.
2014లో టీ20 హోదాను సంపాదించిన నేపాల్.. కొన్ని నెలలకే అఫ్గానిస్థాన్ మీద సంచలన విజయంతో తన పేరు మార్మోగేలా చేసింది. అప్పటికే అఫ్గాన్ చిన్న జట్లలో పెద్ద టీంగా అవతరించింది. అంతర్జాతీయ క్రికెట్లో చక్కటి ప్రదర్శన చేస్తోంది. అలాంటి జట్టు మీద టీ20ల్లో గెలవడంతో నేపాల్ వైపు అందరూ చూశారు. ఇక స్కాట్లాండ్, నెదర్లాండ్స్, కెన్యా లాంటి పేరున్న అసోసియేట్ దేశాలపై నేపాల్ కొన్ని అద్భుత విజయాలు సాధించింది. ఒమన్, యూఏఈ, పపువా న్యూ గినియా లాంటి అసోసియేట్ జట్ల మీద నేపాల్‌కు మంచి రికార్డుంది. ఇప్పుడు మంగోలియా మీద కూడా తన ప్రతాపం చూపించింది. ఇదే జోరు కొనసాగిస్తే త్వరలో పెద్ద జట్లకు కూడా హడలు పుట్టించే అవకాశం ఉంది.
ఐపీఎల్‌లో నేపాలీ
నేపాల్ క్రికెట్‌కు మంచి గుర్తింపు రావడంలో సందీప్ లమిచానెది ముఖ్య పాత్ర. ఈ స్పిన్ ఆల్‌రౌండర్ టీనేజీలోనే గొప్ప ప్రదర్శన చేశాడు. మిస్టరీ స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్నాడు. నేపాల్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అనేక టీ20 లీగ్‌ల్లో కూడా అతను సత్తా చాటాడు. చిన్న వయసులోనే అతను నేపాల్ జట్టుకు కెప్టెన్సీ కూడా చేయడం విశేషం. అతను ఇప్పటికే ఐపీఎల్‌లో కూడా ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్ సందీప్‌ను 2018 సీజన్లో తమ జట్టులోకి తీసుకుంది. వరుసగా రెండు సీజన్లలో ఆడించింది. 9 మ్యాచ్‌లు ఆడిన సందీప్ 22.6 సగటుతో 13 వికెట్లు తీశాడు. ఒక నేపాల్ క్రికెటర్ ఐపీఎల్‌లో ఆడటం అంటే క్రికెట్ పరంగా ఆ దేశానికే అది పెద్ద అచీవ్‌మెంట్. అతను మంచి గణాంకాలే నమోదు చేసినా.. తర్వాత అవకాశాలు రాలేదు. నేపాల్ జట్టులో ఆసిఫ్ షేక్, దీపేంద్ర సింగ్ ఐరీ సహా కొందరు క్రికెటర్లకు భారత మూలాలున్నాయి. గతంలో శక్తి గౌచన్ అనే క్రికెటర్ ముందుగా ముంబయికి ప్రాతినిధ్యం వహించి.. ఆ తర్వాత నేపాల్ జాతీయ జట్టులో చోటు సంపాదించి అంతర్జాతీయ క్రికెట్ ఆడటం విశేషం.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నడవలేని స్థితి వరకు ఐపీఎల్ ఆడతా
జీవితంలో నడవలేని స్థితికి చేరుకునే వరకు ఐపీఎల్‌లో ఆడతానని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అన్నాడు. ఆసీస్ ప్రపంచకప్ విజయంలో కీలకపాత్ర పోషించిన 35 ఏళ్ల మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. -
సివర్, వ్యాట్ ధనాధన్
ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో భారత మహిళలకు పేలవ ఆరంభం. బుధవారం జరిగిన తొలి టీ20లో ఆతిథ్య జట్టు 38 పరుగుల తేడాతో ఓడిపోయింది. అన్ని విభాగాల్లోనూ ఇంగ్లాండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. -
టీ20ల్లో బిష్ణోయ్ నంబర్‌వన్
భారత యువ లెగ్‌స్పిన్నర్ రవి బిష్ణోయ్ టీ20 క్రికెట్లో నంబర్‌వన్ బౌలర్‌గా అవతరించాడు. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. చక్కని ప్రదర్శనతో ఆస్ట్రేలియాతో సిరీస్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డును అందుకున్న 23 ఏళ్ల బిష్ణోయ్. -
టైటాన్స్ మరోసారి..
ప్రొ కబడ్డీలో తెలుగు టైటాన్స్ కథ మారలేదు. ఈసారి భారీ ధర వెచ్చించి స్టార్ కెప్టెన్ పవన్ సెహ్రావత్‌ను తెచ్చుకున్నా ఫలితం కనిపించడం లేదు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ టైటాన్స్‌కు ఓటమి తప్పలేదు. -
గిల్ 400 చేయగలడు
క్రికెట్లో తన ప్రపంచ రికార్డుల్ని భారత ఓపెనర్ శుబ్‌మన్ గిల్ బద్దలు కొడతాడని వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. 2004లో ఇంగ్లాండ్‌తో టెస్టులో లారా అజేయంగా 400 పరుగులు సాధించాడు. టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే. -
దక్షిణాఫ్రికాకు టీమ్ఇండియా
సొంతగడ్డపై టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియాను చిత్తుచేసిన భారత జట్టు మరో సవాల్‌కు సిద్ధమైంది. బుధవారం దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరింది. ఈ పర్యటనలో భారత్, దక్షిణాఫ్రికా జట్లు మూడేసి టీ20లు, వన్డేలు.. రెండు టెస్టుల్లో తలపడతాయి. -
క్రికెట్ మరీ ఎక్కువైపోతోంది.. అందుకే ఆల్‌రౌండర్ల కొరత
అన్ని ఫార్మాట్లలో అతి క్రికెట్ వల్లే నాణ్యమైన ఆల్‌రౌండర్లు రావట్లేదని అంటున్నాడు దక్షిణాఫ్రికా దిగ్గజ ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్. చరిత్రలోనూ ఆల్‌రౌండర్లు ఎక్కువగా లేరని అన్నాడు. ఆధునిక క్రికెట్లో మేటి ఆల్రౌండర్లలో ఒకడిగా పేరున్న కలిస్ మూడు ఫార్మాట్లలో కలిపి 25 వేలకుపైగా పరుగులు చేశాడు. -
ఒక్క రోజే 15 వికెట్లు
బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టులో స్పిన్నర్లు వికెట్ల పండగ చేసుకుంటున్నారు. బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల స్పిన్నర్ల మాయాజాలంతో ఒక్కరోజే 15 వికెట్లు నేలకూలాయి. -
వోజ్నియాకికి ఆస్ట్రేలియన్ ఓపెన్ వైల్డ్‌కార్డ్
మహిళల మాజీ నంబర్‌వన్ కరోలిన్ వోజ్నియాకి (డెన్మార్క్)కి 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో వైల్డ్‌కార్డ్ లభించింది. తొలి దశలో ఆమెతో పాటు ఆరుగురు ఆస్ట్రేలియా క్రీడాకారులకు వైల్డ్‌కార్డులు ఇచ్చారు.


తాజా వార్తలు (Latest News)
-
రేషన్‌కార్డుల జారీపై ఆశలు.. మళ్లీ దరఖాస్తు చేస్తున్న పేదలు
-
Bhimavaram: భీమవరంలో రేవంత్ వియ్యంకుడి ఇంట సందడి
-
ధవళేశ్వరం యువతికి ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు
-
నిజామాబాద్ బబ్లూను.. నిన్ను లేపేస్తా: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో చిక్కిన మందుబాబు వీరంగం
-
Chicken Price: చికెన్ అగ్గువ.. గుడ్డు పిరం
-
Hyderabad: రేవంత్ ప్రమాణస్వీకారం.. నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు