Gautam Gambhir: మీ షార్ప్‌ మెమొరీ సీక్రెట్‌ ఏంటి?గంభీర్‌కు అభిమాని ఆసక్తికర ప్రశ్న

  సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్‌ (Gautam Gambhir)కు ఓ అభిమాని ఆసక్తికర ప్రశ్న అడిగాడు.  

Updated : 31 Dec 2023 18:00 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్‌ (Gautam Gambhir) సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటాడు. ఓ వైపు ఎంపీగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూనే పలు వర్తమాన అంశాలపై తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తుంటాడు. విమర్శలపాలవుతానని తెలిసినా ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్టు చెబుతాడు. గంభీర్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా ఇప్పటికీ ఫిట్‌గా ఉంటాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా సామాజిక మాధ్యమం ఎక్స్ (x)లో #askgg పేరుతో క్వశ్చన్‌ అండ్ ఆన్సర్‌ సెషన్‌ నిర్వహించాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని గంభీర్‌ని ‘‘మీ మెమొరీ షార్ప్‌గా ఉండటం వెనుక సీక్రెట్‌ ఏంటి..?’’ అని ప్రశ్నించాడు. దానికి గంభీర్‌ ‘‘ఆరోగ్యకరమైన బోరింగ్ డైట్‌. నో ఆల్కహల్, నో స్మోకింగ్’’ అని సమాధానమిచ్చాడు. ‘‘మీరు ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్‌ ఎవరు’’ అని మరో అభిమాని అడగ్గా.. ‘‘ఒకే ఒక్కడు అది ముత్తయ్య మురళీధరన్’’ అని గంభీర్‌ జవాబిచ్చాడు.


ఆస్ట్రేలియా 2023 అత్యుత్తమ టెస్టు జట్టు.. భారత్ నుంచి ఇద్దరికి ఛాన్స్‌

2023లో టెస్టు క్రికెట్‌లో వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో క్రికెట్ ఆస్ట్రేలియా (Cricket Australia) తమ జట్టును ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి ఇద్దరికి మాత్రమే చోటు లభించింది. రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా ఈ జాబితాలో ఉన్నారు. పాట్ కమిన్స్‌ని కెప్టెన్‌గా ఎంపిక చేసింది. అత్యధికంగా ఇంగ్లాండ్‌ నుంచి ముగ్గురు ఆటగాళ్లను ఈ జట్టులోకి తీసుకున్నారు.  

క్రికెట్ ఆస్ట్రేలియా బెస్ట్ ఎలెవన్ 2023: 

  • ఉస్మాన్ ఖవాజా (ఆస్ట్రేలియా.. 24 ఇన్నింగ్స్‌లు 1210 పరుగులు) 
  • దిముత్ కరుణరత్నె (శ్రీలంక.. 10 ఇన్నింగ్స్‌లు 608 పరుగులు)
  • కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్.. 13 ఇన్నింగ్స్‌లు 696 పరుగులు)
  • జో రూట్ (ఇంగ్లాండ్.. 14 ఇన్నింగ్స్‌లు 787 పరుగులు)  
  • హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్.. 14 ఇన్నింగ్స్‌లు 701 పరుగులు) 
  • లోర్కాన్ టకర్ (ఐర్లాండ్.. 8 ఇన్నింగ్స్‌లు 351 పరుగులు) 
  • రవీంద్ర జడేజా (భారత్.. 9 ఇన్నింగ్స్‌లు 281 పరుగులు, 33 వికెట్లు)
  • రవిచంద్రన్ అశ్విన్ (భారత్.. 7 మ్యాచ్‌లు 41 వికెట్లు)   
  • పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా.. 11 మ్యాచ్‌లు 42 వికెట్లు)   
  • కగిసో రబాడ (దక్షిణాఫ్రికా.. 4 మ్యాచ్‌లు 20 వికెట్లు)
  • స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్.. 8 మ్యాచ్‌లు.. 38 వికెట్లు)
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని