Pakistan vs Nepal: ప్రపంచ రికార్డు నెలకొల్పిన బాబర్‌ అజామ్‌.. ఆషీమ్‌ ఆమ్లా, కోహ్లీ రికార్డు బద్ధలు..

నేపాల్‌తో జరిగిన ఆసియా కప్ ఆరంభ మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ (Babar Azam) ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

Published : 31 Aug 2023 01:34 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్‌ 2023లో పాకిస్థాన్‌కు అదిరే ఆరంభం లభించింది. నేపాల్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో పాక్‌ 238 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 342 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ బాబర్ అజామ్ (Babar Azam) (151; 131 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) భారీ శతకంతో విరుచుకుపడ్డాడు. మిడిల్ ఆర్డర్‌ బ్యాటర్‌ ఇఫ్తికార్ అహ్మద్ (109; 71 బంతుల్లో 11 ఫోర్లు, 4 ఫోర్లు) మెరుపు శతకం బాదాడు. తొలిసారి ఆసియా కప్ ఆడుతున్న నేపాల్ ఈ భారీ లక్ష్యఛేదనలో 104 పరుగులకే కుప్పకూలింది. ఆరిఫ్ షేక్ (26), సోంపాల్ కామి (28), గుల్సన్ ఝా (13) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. షాదాబ్ ఖాన్‌ (4/27), షాహీన్ అఫ్రిది (2/27), హారిస్‌ రవూఫ్‌ (2/16) నేపాల్‌ బ్యాటర్లను బెంబేలెత్తించారు. 

‘పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అనగానే కోహ్లీ చెలరేగి ఆడతాడు’

మరోవైపు ఈ మ్యాచ్‌లో భారీ శతకం బాదడంతో బాబర్ అజామ్.. వన్డేల్లో సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఈ పాక్ బ్యాటర్‌కు ఇది 19వ సెంచరీ. 102 ఇన్నింగ్స్‌ల్లోనే అతడు ఈ ఘనత అందుకుని వన్డేల్లో వేగంగా అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు ఆషీమ్ ఆమ్లా (104 ఇన్నింగ్స్‌లు), విరాట్ కోహ్లీ (124 ఇన్నింగ్స్‌లు)ల పేరిట ఉండేది. ఇక ఆసియా కప్‌లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన తొలి ఆటగాడిగా బాబర్ అజామ్‌ రికార్డు నెలకొల్పాడు.  


ఇంగ్లాండ్‌లోనూ పురుషులతో సమంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్‌ ఫీజులు

పురుష క్రికెటర్లతో సమంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్‌ ఫీజులను చెల్లించే దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే భారత్, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డులు పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్‌ ఫీజులు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా ఈ జాబితాలో ఇంగ్లాండ్ చేరింది. ఇటీవల ముగిసిన మహిళల మల్టీ ఫార్మాట్‌ యాషెస్ సిరీస్‌కు విశేష ప్రేక్షకాదరణ లభించింది. రికార్డు స్థాయిలో జనాలు స్టేడియాలకు పోటెత్తారు. దీంతో పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్‌ ఫీజులు పెంచుతామని ఈసీబీ (ECB) ప్రకటించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని