Narendra Modi: ఈ స్టేడియం ఆ మహాదేవుడికే అంకితం: ప్రధాని నరేంద్ర మోదీ

వారణాసి (Varanasi)లో నూతన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) శంకుస్థాపన చేశారు. 

Published : 23 Sep 2023 16:48 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం, కాశీ విశ్వనాథుడు కొలువైన వారణాసి (Varanasi)లో నూతన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కార్యదర్శి జై షా, టీమ్‌ఇండియా దిగ్గజాలు సచిన్ తెందూల్కర్, సునీల్ గావస్కర్, రవిశాస్త్రి, కపిల్ దేవ్ తదితరులు పాల్గొన్నారు. స్టేడియానికి శంకుస్థాపన చేసిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడారు. ‘‘ఈరోజు వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి శంకుస్థాపన జరిగింది. మహాదేవుడి నగరంలో నిర్మిస్తున్న ఈ స్టేడియం ఆయనకే అంకితం. ఇది పూర్వాంచల్ యువతకు వరం కానుంది. ప్రపంచం మొత్తం క్రికెట్‌ ద్వారా భారత్‌తో కనెక్ట్ అయింది. క్రికెట్ ఆడేందుకు ఇప్పుడు కొత్త దేశాలు ముందుకు వస్తున్నాయి’’ అని మోదీ అన్నారు. ‘నమో’ అని రాసి ఉన్న టీమ్‌ఇండియా జెర్సీని ప్రధానికి సచిన్ తెందూల్కర్ అందజేశారు. బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా.. మోదీకి క్రికెట్‌ బ్యాట్‌ను జ్ఞాపికగా బహుకరించారు.

శివతత్వం ప్రతిబింబించేలా వారణాసి క్రికెట్ స్టేడియం..

కాశీవిశ్వనాథుడిని దర్శించుకున్న దిగ్గజ క్రికెటర్లు 

అంతకుముందు వారణాసికి చేరుకున్న భారత దిగ్గజ క్రికెటర్లు సచిన్, కపిల్‌దేవ్, సునీల్ గావస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్‌ కాశీవిశ్వనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని