Ricky Ponting: పంత్ సరైనోడే.. ఇంకా నేర్చుకుంటున్నాడు: రికీ పాంటింగ్
దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ యువకుడేనని, అతడింకా కెప్టెన్సీ గురించి నేర్చుకుంటున్నాడని ఆ జట్టు ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ అన్నాడు...
ఇంటర్నెట్‌డెస్క్: దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ యువకుడేనని, అతడింకా కెప్టెన్సీ గురించి నేర్చుకుంటున్నాడని ఆ జట్టు ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ అన్నాడు. గతరాత్రి ముంబయితో జరిగిన మ్యాచ్‌లో ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేక తీవ్ర విమర్శల పాలయ్యాడు పంత్. ఈ నేపథ్యంలోనే పాంటింగ్ మాట్లాడుతూ రిషభ్ పంతే దిల్లీ జట్టుకు సరైన నాయకుడని కీర్తించాడు. అతడు జట్టు పగ్గాలు అందుకున్నప్పటి నుంచి అద్భుతంగా నడిపిస్తున్నాడని చెప్పాడు.
‘గతేడాది పంత్‌ను కెప్టెన్‌గా చేశాం. అతడే సరైన నాయకుడు. శ్రేయస్ అయ్యర్ గాయపడిన తర్వాత జట్టును బాగా నడిపించాడు. అయితే, అతడింకా యువకుడే. కెప్టెన్సీ గురించి ఇంకా నేర్చుకుంటున్నాడు. టీ20ల్లో కెప్టెన్సీ అంత ఆషామాషీ కాదు. ముఖ్యంగా అత్యంత ఒత్తిడి ఉండే భారత టీ20 లీగ్‌లో మరింత ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఈ టోర్నీలో ప్రతి చిన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అయితే, పంత్‌కు నా పూర్తి మద్దతు ఉంటుంది’ అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
పంత్ చాలా తెలివిగల ఆటగాడని, వికెట్ల వెనక నుంచి ఆటను బాగా అర్థం చేసుకుంటాడని కోచ్ మెచ్చుకున్నాడు. అతడు మరింత దృఢంగా తిరిగి వస్తాడన్నాడు. అలాగే ఈ సీజన్లో తమ జట్టు అనేక ఒడుదొడుకులను ఎదుర్కొందని చెప్పాడు. తమ శిబిరంలో పలువురు ఆటగాళ్లు అనారోగ్యం బారినపడ్డారని, మరి కొందరు కొవిడ్-19 బారిన పడ్డారని గుర్తుచేసుకున్నాడు. కాగా, ప్రస్తుత సీజన్లో దిల్లీ చివరి మ్యాచ్‌లో ముంబయిపై విజయం సాధిస్తే ప్లేఆఫ్స్ చేరే అవకాశం ఉన్నా మ్యాచ్ గెలవలేకపోయింది. ముఖ్యంగా ముంబయి బ్యాట్స్‌మన్ టిమ్ డేవిడ్ (34; 11 బంతుల్లో 2x4, 4x6) ధనాధన్ బ్యాటింగ్‌తో దిల్లీకి మ్యాచ్‌ను దూరం చేశాడు. అయితే, టిమ్ ఎదుర్కొన్న తొలి బంతికే పంత్ చేతికి చిక్కినా.. అదృష్టవశాత్తూ బతికిపోయాడు. ఆ బంతికి పంత్ రివ్యూకు వెళ్లి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవని అభిమానులు విమర్శిస్తున్నారు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్‌నవూ చిత్తు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లిన కోల్‌కతా
లఖ్‌నవూపై కోల్‌కతా 98 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలక్ష అగ్రస్థానానికి దూసుకెళ్లింది. 236 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ 16.1 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌట్ అయింది. -
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
ఐపీఎల్-17లో చెన్నై ఆరో విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. -
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
చెన్నై జట్టుకు గాయాలు ఇబ్బందిగా మారాయి. యువ పేసర్ పతిరన గాయం కారణంగా స్వదేశానికి వెళ్లిపోయాడు. -
డోపింగ్ శాంపిల్‌కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
డోపింగ్ పరీక్షకు శాంపిల్ ఇవ్వని కారణంగా రెజ్లర్ బజరంగ్ పునియాపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) సస్పెన్షన్ వేటు వేసింది. -
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
ఐపీఎల్ 17వ సీజన్లో సిరాజ్ తొలిసారి అత్యుత్తమ బౌలింగ్‌తో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాడు. బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు. -
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
క్రికెట్ అభిమానులను అలరించడానికి ప్రతి దేశం ఓ లీగ్‌ను నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే భారత్‌లో ఐపీఎల్, పాక్‌లో పీఎస్ఎల్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే, వచ్చే ఏడాది ఈ రెండు ఒకే సమయంలో జరిగే అవకాశం ఉంది. -
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
బెంగళూరు చేతిలో ఓటమితో గుజరాత్ కూడా ప్లేఆఫ్స్ అవకాశాలను దాదాపు దూరం చేసుకుంది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. -
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్‌కు తప్పని బాడీ షేమింగ్
భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్‌కు సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ ఎదురైంది. అతడూ ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. -
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్‌రౌండర్‌గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్‌లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్‌రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్‌సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్‌పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్‌తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్‌తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్‌బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్‌గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్‌కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్‌కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!
-
లఖ్‌నవూ చిత్తు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లిన కోల్‌కతా
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
‘మాకు పిల్లలు లేరు’.. వారి భవిష్యత్తు కోసమే మా తపన: మోదీ
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్