Jay Shah: టీ20 ప్రపంచకప్‌ కోసం అతడికి ద్వారాలు తెరిచే ఉన్నాయి : పంత్‌పై జైషా

ఐపీఎల్‌ ఆడేందుకు సిద్ధమైన రిషభ్‌ పంత్‌(Rishabh Pant)పై కీలక అప్‌డేట్‌ ఇచ్చారు బీసీసీఐ కార్యదర్శి జైషా.

Published : 11 Mar 2024 20:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  ఘోర రోడ్డు ప్రమాదం కారణంగా చాలాకాలంగా ఆటకు దూరమైన రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) ఐపీఎల్‌ 17(IPL 2024)వ సీజన్‌ ఆడేందుకు సిద్ధమయ్యాడు.   దిల్లీ క్యాపిటల్స్‌ను ముందుండి నడిపించనున్నాడు. ఈ సమయంలో అతడిపై మరో అప్‌డేట్‌ ఇచ్చారు బీసీసీఐ(BCCI) కార్యదర్శి జైషా(Jay Shah). ఐపీఎల్‌ తర్వాత జరిగే టీ20 ప్రపంచకప్‌(T20 World Cup 2024) ఆడేందుకు అతడికి ద్వారాలు తెరిచే ఉన్నాయని పేర్కొన్నారు. త్వరలో నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ(NCA) పంత్‌ ఫిట్‌నెస్‌ను నిర్ధరించనుంది.

‘పంత్‌ బాగా ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. బ్యాటింగ్‌తోపాటు కీపింగ్‌ చేస్తున్నాడు. త్వరలో అతడి ఫిట్‌నెస్‌పై ప్రకటన విడుదల చేస్తాం. ఒకవేళ అతడు టీ20 ప్రపంచకప్‌ ఆడగలిగితే.. టీమ్‌ఇండియాకు అదనపు బలం చేకూరుతుంది. ఐపీఎల్‌లో అతడి ఆటతీరును నిశితంగా గమనిస్తాం. అతడి భవిష్యత్తు కార్యాచరణను ఎన్‌సీఏ చీఫ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌, నితిన్ పటేల్‌ నేతృత్వంలోని బీసీసీఐ వైద్యబృందం నిర్ణయిస్తుంది. అతడికి ద్వారాలు తెరిచే ఉన్నాయి. మేం వేచి ఉన్నాం. అతడి ఫిట్‌నెస్‌ను మా బృందం పరిశీలిస్తుంది’’ అని షా పేర్కొన్నారు. టీ20 ప్రపంచకప్‌ జూన్‌లో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

నాయకులైతే మారారు... మరి ఫలితం మారుస్తారా?

పంత్‌పై దిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ కూడా స్పందించాడు. ఫిట్‌నెస్ కోసం ఈ యువ క్రికెటర్ చాలా కష్టపడుతున్నాడనీ.. కేవలం బ్యాటింగ్ మాత్రమే కాకుండా.. ఫీల్డింగ్‌, కీపింగ్‌ పైనా దృష్టి పెట్టాడని తెలిపాడు. ఇప్పటివరకైతే ఎలాంటి సమస్య ఉత్పన్నం కాలేదని పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని