Virat Kohli: రోహిత్‌కు బాధ్యతలు.. కోహ్లి ఇలాగే కొనసాగాలి : షాహిద్‌ అఫ్రిది

న్యూజిలాండ్‌ జట్టుతో త్వరలో ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మకు నాయకత్వ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. దీనిపై పాక్ మాజీ క్రికెటర్‌ షాహిద్ అఫ్రిది

Updated : 13 Nov 2021 10:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: న్యూజిలాండ్‌ జట్టుతో త్వరలో ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మకు నాయకత్వ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. దీనిపై పాక్ మాజీ క్రికెటర్‌ షాహిద్ అఫ్రిది స్పందిస్తూ.. రోహిత్‌కు బాధ్యతలు అప్పగించడంతో విరాట్ కోహ్లి మరింత కాలం బ్యాటర్‌గా రాణిస్తాడని పేర్కొన్నాడు. కోహ్లి సేవలు టీమిండియాకు చాలా అవసరమని.. అతడు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీని వదులుకుంటే తన బ్యాటింగ్‌పై మరింత దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుందని సూచించాడు.

‘టీమిండియా, పాకిస్థాన్ జట్లకు నాయకత్వం వహించడమనేది చాలా బాధ్యతతో కూడుకున్న వ్యవహారం. జట్టు రాణిస్తున్నంత కాలం అందరూ పొగుడుతూనే ఉంటారు. ఒకవేళ విఫలమైతే అభిమానులు జీర్ణించుకోలేరు. సారథ్య బాధ్యతలను మోస్తూ కోహ్లి బ్యాటింగ్‌పై పూర్తి దృష్టి పెట్టలేకపోతున్నాడు. అందుకే అతడు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీని వదులుకుని.. ఆటగాడిగా కొనసాగాలి. నాణ్యమైన బ్యాటర్‌గా అతడి సేవలు టీమిండియాకు చాలా అవసరం. అతడిలో ఇంకా చాలా క్రికెట్‌ మిగిలి ఉంది’ అని అఫ్రిది పేర్కొన్నాడు.

‘నేను ఐపీఎల్‌లో (డెక్కన్‌ ఛార్జర్స్ తరఫున) ఆడినప్పుడు రోహిత్‌ శర్మ ఆటను చాలా దగ్గర్నుంచి గమనించాను. అతడు గొప్ప బ్యాట్స్‌మన్. షాట్ల ఎంపిక గొప్పగా ఉంటుంది. అతడు జట్టు అవసరాలను బట్టి దూకుడుగాను ఆడగలడు. క్లిష్టపరిస్థితుల్లో నిలకడగా ఆడుతూ జట్టును విజయ తీరాలకు చేర్చగలడు. టీమిండియా కెప్టెన్సీ మార్పు సరైనదే. రోహిత్‌కు ఓ అవకాశం ఇవ్వాలి’ అని అఫ్రిది సూచించాడు. ఇటీవల విరాట్‌ కోహ్లి టీ20 నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. 

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు