GT vs CSK: నేడు చెన్నైతో మ్యాచ్‌.. ధోనీ సేనకు గిల్‌ స్వీట్‌ వార్నింగ్‌

నేడు చెన్నై చెపాక్‌ వేదికగా ఐపీఎల్‌(IPL 2023) తొలి క్వాలిఫయర్‌(Qualifier 1) మ్యాచ్‌ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌ చేరుకుంటుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది.

Updated : 23 May 2023 11:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇన్ని రోజులు లీగ్‌ మ్యాచ్‌లతో అలరించిన ఐపీఎల్‌(IPL 2023)లో అసలు సమరం(Playoffs) నేటి నుంచే. చెన్నై చెపాక్‌ వేదికగా తొలి క్వాలిఫయర్‌(Qualifier 1) పోరుకు చెన్నై, గుజరాత్‌(GT vs CSK)లు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన వారు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో దిగ్గజ జట్ల మధ్య మరో ఉత్కంఠ పోరు సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక నేటి మ్యాచ్‌ నేపథ్యంలో గుజరాత్‌(Gujarat Titans) ఓపెనర్‌, సెంచరీల హీరో శుభ్‌మన్‌ గిల్‌(Shubman Gil) కీలక వ్యాఖ్యలు చేశాడు.

చెపాక్‌ స్టేడియంలో చెన్నై(Chennai Super Kings)ని ఎదుర్కొనేందుకు తమ వద్ద గొప్ప బౌలింగ్‌ దళం ఉందని ధోనీ సేనకు గిల్‌ స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. ‘చెపాక్‌ వికెట్‌పై చెన్నైని ఎదుర్కొనేందుకు మా వద్ద గొప్ప బౌలింగ్‌ దళం ఉందని నేను భావిస్తున్నాను. చెన్నైలో చెన్నైపై తలపడటం కోసం మేం ఉత్సాహంగా ఉన్నాం. రెండో సారి మేం ఫైనల్‌లో అడుగుపెడతామని విశ్వాసముంది’ అని గిల్‌ పేర్కొన్నాడు.

ఇక తన ఆట గురించి మాట్లాడుతూ.. ‘నా ఆటేంటో నాకు తెలుసు.. ఏ ఆటగాడికైనా తనకు తాను తెలుసుకోవడం ఎంతో ముఖ్యం’ అని వివరించాడు. ‘మంచి స్టార్ట్‌ లభించాలి. దాన్ని పెద్ద స్కోరుగా మలచాలి. గత మ్యాచ్‌లో నేను అలా చేయగలిగాను’ అని తన సెంచరీ గురించి స్పందించాడు గిల్‌. ఈ గుజరాత్‌ ఓపెనర్‌ తాజా సీజన్‌లో అదరగొడుతున్న విషయం తెలిసిందే. అతడు ఇప్పటికే 680 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో ఆర్సీబీ కెప్టెన్‌ డుప్లెసిస్‌(730) తర్వాతి స్థానంలో ఉన్నాడు. ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లు ఉండటంతో డుప్లెసిస్‌ను అధిగమించే అవకాశాలు గిల్‌కు ఎక్కువగా ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని