U-19 World Cup: ఐర్లాండ్‌పై యువభారత్ భారీ విజయం
అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ దుమ్మురేపుతోంది. తొలిమ్యాచ్‌లో బలమైన దక్షిణాఫ్రికాను చిత్తుచేసిన యువ భారత్ తాజాగా పసికూన ఐర్లాండ్‌ను 174 పరుగుల తేడాతో మట్టికరిపించింది.
టరౌబా(ట్రినిడాడ్ అండ్ టొబాగో): అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ దుమ్మురేపుతోంది. తొలిమ్యాచ్‌లో బలమైన దక్షిణాఫ్రికాను చిత్తుచేసిన యువ భారత్ తాజాగా పసికూన ఐర్లాండ్‌ను 174 పరుగుల తేడాతో మట్టికరిపించింది. కరోనా కలకలంతో కెప్టెన్ యశ్‌దుల్ సహా కీలక ఆటగాళ్లు బరిలోకి దిగకున్నా.. నిశాంత్ సింధు నేతృత్వంలో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. ఓపెనర్లు హర్నూర్ సింగ్(88), రఘువంశీ(79) అర్ధశతకాలతో చెలరేగారు. తొలివికెట్‌కు 164 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి గట్టి పునాది వేశారు. ఇక మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రాజ్ బవ(42), నిశాంత్ సింధు(36), రాజ్వర్ధన్(39) రాణించడంతో భారత్ 300 పైచిలుకు పరుగులు చేసింది. అనంతరం 308 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన ఐర్లాండ్ 39 ఓవర్లలో 133 పరుగులకే చాపచుట్టేసింది. దీంతో భారత్ 174 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్ల సమష్ఠిగా బౌలింగ్ చేశారు. సంగ్వాన్, అనీశ్వర్ గౌతమ్, కౌషల్ తంబే తలో రెండు వికెట్లు తీయగా, విక్కీ ఓస్వాల్, రవికుమార్, రాజవర్ధన్ తలో వికెట్ తీశారు. హర్నూర్ సింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ది అవార్డు వచ్చింది.
బెంబేలెత్తిన ఐర్లాండ్..
భారత బౌలర్ల పదునైన బంతులకు ఐర్లాండ్ బెంబేలెత్తింది. 308 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ ఏ దశలోనూ విజయం దిశగా ఇన్నింగ్స్‌ను నడిపించలేదు. 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 17 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన ఆజట్టు 66 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. దీంతో ఆ జట్టు దాదాపు ఓటమిని అంగీకరించినట్లైంది. ఆ జట్టులో స్కాట్ మెక్బెత్(32) టాప్‌స్కోరర్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరుణుడి అడ్డంకి.. బంగ్లాదేశ్‌పై భారత్ విజయం
బంగ్లాదేశ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భారత మహిళల జట్టు రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. -
ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్‌లకు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాళ్లు దూరం.. కారణమిదే
పొట్టి ప్రపంచకప్‌లో ఆడే ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఐపీఎల్-17 సీజన్ ప్లేఆఫ్స్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండరు. ఈమేరకు ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనను విడుదల చేసింది. -
T20 World Cup 2024: న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ భవనంపై టీమ్ఇండియా పేర్లు
జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. కెప్టెన్‌గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య వ్యవహరిస్తారు. న్యూయార్క్‌లోని ఎంపైర్ స్టేట్ భవనంపై టీమ్ఇండియా సభ్యుల పేర్లను ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియోను మీరూ చూడండి.
-
టీ20 ప్రపంచకప్.. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు ఇవే..
జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇంగ్లాండ్, సౌతాఫ్రికా తమ జట్లను ప్రకటించాయి. -
టీ20 ప్రపంచకప్.. భారత జట్టు ఇదే
జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. -
యువ రోహిత్‌ను చూశారా.. బర్త్‌డే గిఫ్ట్‌గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ
భారత క్రికెట్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని కెప్టెన్‌గా ఎదిగిన రోహిత్ శర్మ (Rohit Sharma) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా హిట్‌మ్యాన్‌కు ప్రముఖులు, ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. -
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు గుడ్‌న్యూస్.. ముంబయికి చావోరేవో
లఖ్‌నవూకు శుభవార్త. గాయం కారణంగా పలు మ్యాచ్‌లకు దూరమైన మయాంక్ యాదవ్ (mayank yadav) ఫిట్నెస్ సాధించాడు. -
సునీల్ నరైన్‌ను టీమ్ మీటింగ్‌లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
కోల్‌కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తమ జట్టు ఓపెనర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ బ్యాటింగ్ తీరు, టీమ్ మీటింగ్‌ల పట్ల వీరు ఎలా వ్యవహరిస్తారనే ఆసక్తికర విషయాలు వివరించాడు. -
ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
కోల్‌కతా కుమ్మేసింది
కోల్‌కతా అదరగొట్టింది. ఆల్‌రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్‌తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్‌రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
క్వార్టర్స్‌లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్‌ఫైనల్స్‌లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్‌లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్‌కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్‌శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్‌లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్‌కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్‌కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్‌లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
-
ఓటీటీలో సిద్ధార్థ్ రాయ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
వరుణుడి అడ్డంకి.. బంగ్లాదేశ్‌పై భారత్ విజయం
-
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి