Dinesh Karthik: కార్తిక్‌ మంచి ఫినిషరే.. కానీ వీళ్లే అసలైన ఫినిషర్లు: మాజీ క్రికెటర్‌

మ్యాచ్‌ను అద్భుతంగా ముగించి..జట్టును గెలిపించే ఫినిషర్లు చాలా అరుదుగా ఉంటారు.

Published : 12 Aug 2022 01:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మ్యాచ్‌ను అద్భుతంగా ముగించి.. జట్టును గెలిపించే ఫినిషర్లు అరుదుగా ఉంటారు. ఇటీవల భారత టీ20 లీగ్‌లో అదరగొట్టి టీమ్‌ఇండియాలోకి (Team India) రీ-ఎంట్రీ ఇచ్చిన దినేశ్‌ కార్తీక్‌ (Dinesh Karthik) ఫినిషర్‌గా పేరు తెచ్చుకుంటున్నాడు. మ్యాచ్‌ చివర్లో వచ్చి మెరుపులు మెరిపిస్తున్నాడు. ఈ క్రమంలో ఆసియా కప్‌కు (Asia Cup) ఎంపిక చేసిన బృందంలోనూ చోటు సంపాదించాడు. ఈ ఏడాది చివర్లో జరగనున్న టీ 20 ప్రపంచకప్‌కు (T20 World Cup) డీకే ఈ కోటాలోనే బెర్త్‌ ఖాయం చేసుకుంటాడని క్రికెట్‌ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే, భారత జట్టు మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ (Srikanth) మాత్రం భిన్నంగా స్పందించాడు. టీమ్‌ ఇండియాలో ఫినిషర్‌ పాత్రపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఫినిషర్‌కు స్పష్టమైన అర్థం చెప్పాలనుకుంటున్నాను. టీమ్‌ ఇండియాలో ఫినిషర్‌ అంటున్న కార్తిక్‌ ఇటీవల మంచి ప్రదర్శనలే చేశాడు. ఆ లెక్కన డీకే మంచి ఫినిషరే.. కానీ చివరి 5 ఓవర్లు బ్యాటింగ్ చేస్తే అతను గొప్ప ఫినిషర్ అని చెప్పలేను. ఫినిషర్ అంటే 8 నుంచి 12 ఓవర్ల మధ్య బ్యాటింగ్‌కు వచ్చి 20వ ఓవర్ వరకు కొనసాగి, మ్యాచ్‌ని గెలిపించగలగాలి. నా దృష్టిలో సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఫినిషర్. రిషభ్‌ పంత్ తెలివైన ఫినిషర్. వీరితో పాటు హార్దిక్‌ పాండ్య కూడా ఈ లిస్ట్‌లో ఉన్నాడు. వీరినే నేను బెస్ట్‌ ఫినిషర్లుగా భావిస్తాను

- శ్రీకాంత్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని