
IPL - RCB: నెవర్ గివప్... స్టెప్పులతో అదరగొట్టిన ఆర్సీబీ ఆటగాళ్లు
బెంగళూరు: ‘నెవర్ గివప్... డోంట్ బ్యాక్ డౌన్...’ అంటూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ రూపొందించిన మ్యూజిక్ వీడియో సోషల్ మీడియాలో ఉర్రూతలూగిస్తోంది. జట్టు థీమ్‌ను, సభ్యుల దృక్పథాన్ని, క్రికెట్‌ను వారు ఆరాధిస్తున్న విధానాన్ని తెలిపేలా ఈ పాటను రూపొందించారు. ఆర్సీబీ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, దేవదత్ పడిక్కల్, యుజ్వేంద్ర చాహల్, నవదీప్ సైనీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, కైల్ జేమీసన్ తదితరులు పాటలో తమ స్టెప్పులతో అదరగొట్టారు. ఈ వీడియోను విరాట్ కోహ్లి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ ‘ఓటమికి ఎప్పుడూ తలవంచొద్దు. పోరులో వెనుకబడిపోవద్దు...’ అని రాసుకొచ్చాడు. ఈ మ్యూజిక్ వీడియోకు క్రికెటర్ యజువేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ డైరెక్టర్, కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించడం విశేషం. ఇటీవల దుబాయిలో ఐపీఎల్ జరిగిన సమయంలో ఈ పాటను రూపొందించినట్లు తెలుస్తోంది.
► Read latest Sports News and Telugu News