Tokyo Olympics: ఒలింపిక్స్‌కు కష్టమనే అనుకున్నా

అమెరికా స్టార్‌ జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌ టోక్యో ఒలింపిక్స్‌లో ఆరు ఈవెంట్లలో ఫైనల్స్‌కు అర్హత సాధించినా మానసిక ఒత్తిడి కారణంగా అయిదు ఈవెంట్ల నుంచి వైదొలిగింది...

Updated : 29 Sep 2021 09:41 IST

వాషింగ్టన్‌: అమెరికా స్టార్‌ జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌ టోక్యో ఒలింపిక్స్‌లో ఆరు ఈవెంట్లలో ఫైనల్స్‌కు అర్హత సాధించినా మానసిక ఒత్తిడి కారణంగా అయిదు ఈవెంట్ల నుంచి వైదొలిగింది. నిజానికి తాను టోక్యో ఒలింపిక్స్‌ బరిలో దిగుతానని అనుకోలేదని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అమెరికా జిమ్నాస్టిక్స్‌ టీమ్‌ డాక్టర్‌ లారీ నాసర్‌ లైంగిక వేధింపుల ఉదంతం తనపై తీవ్ర ప్రభావం చూపిందని ఆమె చెప్పింది. లారీ బాధితుల్లో తానూ ఉన్నానని 2018లో బైల్స్‌ వెల్లడించింది. ‘‘గత ఏడేళ్లలో నేనెదుర్కొన్నా సమస్యలను పరిశీలిస్తే అసలు ఒలింపిక్స్‌ జట్టులోనే ఉండాల్సింది కాదు. రెండేళ్లకుపైగా లారీపై మీడియాలో చాలా చర్చనే సాగింది. ఇది నాపై తీవ్ర ప్రభావం చూపింది. టోక్యో ఒలింపిక్స్‌కు ముందే దూరం కావాల్సింది. జిమ్నాస్టిక్స్‌ కోసం ఆరేళ్ల వయసు నుంచి ఎంతో పోరాడాను. దాంట్లో నేను పొందుతున్న ఆనందాన్ని ఓ వ్యక్తి కారణంగా దూరం చేసుకోకూడదని భావించి బరిలో దిగాను. అయితే మానసిక ఒత్తిడికి తోడు టోక్యోలో ట్విస్టీస్‌ సమస్య ఎదురుకావడంతో ఫైనల్‌ పోటీలకు దూరం కాక తప్పలేదు’’ అని బైల్స్‌ వివరించింది. 2016 ఒలింపిక్స్‌లో బైల్స్‌ నాలుగు స్వర్ణాలు నెగ్గింది. టోక్యోలో ఆ రికార్డును అధిగమిస్తుందని అంతా భావించారు. అయితే ఆమె ఒక్క స్వర్ణం కూడా నెగ్గలేదు. టీమ్‌ విభాగంలో రజతం నెగ్గిన బైల్స్‌.. వ్యక్తిగత విభాగంలో కాంస్యంతో సరిపెట్టుకుంది. వందలాది మంది జిమ్నాస్ట్‌లను శారీరకంగా, మానసికంగా వేధించాడనే అభియోగాలు రుజువు కావడంతో నాసర్‌ ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు