World Cup 2023: గేమ్‌ ఛేంజింగ్ ఫీల్డర్స్‌.. జాబితాలో ఇద్దరు భారత ఆటగాళ్లు

ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌ (World Cup 2023)లో అత్యుత్తమంగా ఫీల్డింగ్ చేసిన ఆటగాళ్ల జాబితాను ఐసీసీ (ICC) విడుదల చేసింది. ఈ జాబితాలో ఇద్దరు భారత ఆటగాళ్లకు చోటుదక్కింది.

Updated : 21 Nov 2023 16:32 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ముగిసిన ప్రపంచ కప్‌లో అత్యుత్తమంగా ఫీల్డింగ్ చేసిన ఆటగాళ్ల జాబితాను ఐసీసీ (ICC) ప్రకటించింది. ఒక్కో ఆటగాడికి రేటింగ్ ఇస్తూ 10 మందిని ఎంపిక చేసింది. ఇందులో ఆస్ట్రేలియానుంచి అత్యధికంగా ముగ్గురు చోటు దక్కించుకున్నారు. భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ నుంచి ఇద్దరేసి ఆటగాళ్లకు చోటు దక్కింది. నెదర్లాండ్స్‌ నుంచి ఒకరికి అవకాశం లభించింది. భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ (Virat Kohli) ఈ జాబితాలో చోటు దక్కింది. ఆసీస్ ఆటగాడు మార్నస్ లబుషేన్ అగ్రస్థానంలో నిలిచాడు. అతడు తన ఫీల్డింగ్‌తో 15 పరుగులు కాపాడటమే కాకుండా ఒక డైరెక్ట్ రనౌట్, మూడు రనౌట్లలో సహాయపాత్ర పోషించాడు. ఆసీస్‌కే చెందిన వార్నర్ రెండో స్థానంలో నిలిచాడు. 

అత్యుత్తమంగా ఫీల్డింగ్ చేసిన ఆటగాళ్లు.. 

  • మార్నస్ లబుషేన్ (ఆస్ట్రేలియా, 82.66)
  • డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా, 82.55)
  • డేవిడ్ మిల్లర్ (సౌతాఫ్రికా, 79.48)
  • రవీంద్ర జడేజా (భారత్, 72.72)
  • సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ (నెదర్లాండ్స్, 58.72)
  • విరాట్ కోహ్లీ (భారత్, 56.79)
  • ఐడెన్ మార్‌క్రమ్ (సౌతాఫ్రికా, 50.85)
  • మిచెల్ శాంట్నర్ (న్యూజిలాండ్, 46.25)
  • గ్లెన్ మ్యాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా, 45.07)
  • గ్లెన్ ఫిలిప్స్‌ (న్యూజిలాండ్, 42.76)

అత్యుత్తమంగా ఫీల్డింగ్ చేసిన జట్లు.. 

ఈ ప్రపంచకప్‌లో అత్యుత్తమంగా ఫీల్డింగ్ చేసిన జట్లను కూడా ఐసీసీ ప్రకటించింది. ఆస్ట్రేలియా (383.58) అగ్రస్థానంలో ఉండగా.. సౌతాఫ్రికా (340.59), నెదర్లాండ్స్‌ (292.02), భారత్ (281.04), ఇంగ్లాండ్ (255.43), న్యూజిలాండ్ (225.53), పాకిస్థాన్ (212.61), శ్రీలంక (184.83), బంగ్లాదేశ్‌ (174.98), అఫ్గానిస్థాన్‌ (123.12) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని