PBKS vs KKR: సెంటిమెంట్‌ వర్కవుట్‌ అయితే పంజాబ్‌దే విజయం!

ఒక గెలుపు, ఒక ఓటమి.. పంజాబ్‌ సూపర్‌ కింగ్స్‌ గత ఏడు మ్యాచ్‌లుగా ఇలానే ఆడుతోంది. మరి కోల్‌కతా మ్యాచ్‌లో ఏం చేస్తుందో చూడాలి. 

Updated : 08 May 2023 15:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్: క్రికెట్‌ ఆడేవాళ్లకు, చూసేవాళ్లకు సెంటిమెంట్స్‌ ఉంటాయి అంటుంటారు. ఆడేవాళ్ల సంగతేమో కానీ.. చూసేవాళ్లకైతే చాలానే ఉంటాయి. అలాంటి ఓ సెంటిమెంట్‌ పంజాబ్‌ కింగ్స్‌ (Punjab Kings)కి ఈ ఐపీఎల్‌ (IPL 2023)లో గత కొన్ని రోజులుగా వర్కవుట్‌ అవుతోంది. ఈ రోజు కూడా అదే జరిగితే కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (Kolkata Knight Riders)పై పంజాబ్‌ కింగ్స్‌ విజయం పక్కా అని చెప్పొచ్చు అని నెటిజన్లు అంటున్నారు. 

ఐపీఎల్‌ 2023ని రెండు వరుస విజయాలతో స్టార్ట్‌ చేసింది పంజాబ్‌ సూపర్‌ కింగ్స్‌. అయితే అనూహ్యంగా తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అయితే ఆ తర్వాతనే ఈ సెంటిమెంట్‌ మొదలైంది. అదే ఒక పరాజయం, ఒక విజయం. ఐపీఎల్‌ పాయింట్ల పట్టికలో పంజాబ్‌ స్టైల్‌ చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది. పంజాబ్‌ పాయింట్ల పట్టిక స్టైల్‌ ఇదీ: W, W, L, L, W, L, W, L, W, L. (ఫలితాలు ఎడమ నుంచి కుడి). ప్రస్తుతం 10 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్న పంజాబ్‌.. సోమవారం కోల్‌కతాపై నెగ్గితే ఏకంగా మూడో స్థానానికి వెళ్లిపోతుంది.

ఇప్పటివరకు ఈ లాస్‌ అండ్‌ విన్‌ కాంబినేషన్‌ను మూడు సార్లు కంప్లీట్‌ చేసింది. ఇప్పుడు కోల్‌కతా మీద నెగ్గితో నాలుగోసారి కూడా పూర్తవుతుంది. అలాగే ప్రజెంట్‌ రివేంజ్‌ డ్రామాలో మరోసారి భాగస్వామ్యం తీసుకున్నట్లు అవుతుంది. ఈ సంవత్సరం ఐపీఎల్‌లో జట్టు తమ సొంత మైదానంలో ఓడి, ప్రత్యర్థి  మైదానంలో గెలుస్తున్నారు. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి గత మ్యాచ్‌లో పరాభవానికి బదులు తీర్చుకోవాలని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చూస్తోంది. ఈ నేపథ్యంలో ఈడెన్‌ గార్డెన్స్‌లో ఈ రోజు జరగబోయే పంజాబ్‌ X కోల్‌కతా మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని