ఫేస్‌బుక్‌లో ఇన్‌స్టా ‘రీల్స్‌’..!

 వీడియో షేరింగ్‌ యాప్‌లలో టిక్‌ టాక్‌ ఎంతో ఫేమస్‌. మరి అలాంటి యాప్‌ భారత్‌లో నిషేధానికి గురైన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది యూజర్లు...

Published : 10 Mar 2021 18:09 IST

త్వరలో వీడియోలను షేర్‌ చేసుకునే అవకాశం

ఇంటర్నెట్‌ డెస్క్‌: వీడియో షేరింగ్‌ యాప్‌లలో టిక్‌ టాక్‌ ఎంతో ఫేమస్‌. మరి అలాంటి యాప్‌ భారత్‌లో నిషేధానికి గురైన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది యూజర్లు యూట్యూబ్‌ ఛానెల్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ వైపు మొగ్గు చూపారు. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌ తన యూజర్లకు అద్భుత అవకాశం కల్పించనుంది. ఇక నుంచి యూజర్లు తాము రూపొందించే షార్ట్‌ వీడియోలను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసుకునే వెసులుబాటు కల్పించనుంది. ఈ మేరకు టెస్టింగ్‌ జరుపుతున్నట్లు టెక్‌ వర్గాలు పేర్కొన్నాయి. అగ్మెంటెడ్ రియాల్టీ (ఏఆర్‌)తో ఇప్పటికే కొంతమంది యూజర్లకు ‘ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌’ వీడియోలను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసుకునేందుకు అనుమతినిచ్చింది. ఫేస్‌బుక్‌ తక్కువ నిడివి కలిగిన వీడియోల విభాగానికి ‘రీల్స్‌ ఆన్‌ ఫేస్‌బుక్‌’గా పేరు మార్చనుంది. 

భారత్‌లో టిక్‌టాక్‌ లేకపోవడంతో లోటును భర్తీచేసేందుకు ఫేస్‌బుక్‌ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. తన నెట్‌వర్క్‌ను వినియోగించుకుని భారత యూజర్లకు దగ్గర కానుంది. దేశంలో ఫేస్‌బుక్‌కు భారీ సంఖ్యలోనే యూజర్లు ఉన్నారు. టిక్‌టాక్‌కు పోటీగా ఇన్‌స్టాగ్రామ్‌ ‘రీల్స్‌’ను గతేడాది తీసుకొచ్చింది. కౌంట్‌డౌన్ క్లాక్‌, టైమర్స్‌ వంటి ఆప్షన్లతో యూజర్లు 15 సెకన్ల నిడివితో వీడియోలను రూపొందించవచ్చు. అదే విధంగా అవసరమైన మ్యూజిక్‌ లైబ్రరీ యాక్సెస్‌ను కల్పించింది. కొంతకాలం తర్వాత వ్యాపారానికి సంబంధించిన హోస్ట్‌లా ‘రీల్స్‌’లో అదనపు ఫీచర్లను ఇన్‌స్టాగ్రామ్‌ యాడ్‌ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని