సురక్షితమైన సాఫ్ట్‌వేర్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండిలా..!

మనిషి బతకాలంటే హృదయ స్పందన ఎంత ముఖ్యమో.. కంప్యూటర్, లాప్‌ట్యాప్‌లు సాఫీగా రన్‌ అవ్వాలంటే...

Updated : 12 Aug 2022 14:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనిషి బతకాలంటే హృదయ స్పందన ఎంత ముఖ్యమో.. కంప్యూటర్, లాప్‌ట్యాప్‌లు సాఫీగా రన్‌ అవ్వాలంటే సాఫ్ట్‌వేర్‌ అంతే కీలకం. మరి అలాంటి సాఫ్ట్‌వేర్‌లు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకుంటూ ఉండాలి. అలానే సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడంలో ఎంతో జాగ్రత్త వహించాలి. అనేక రకాల వెబ్‌సైట్లు వైరస్‌లతో కూడిన సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌లను అప్‌లోడ్‌ చేస్తూ ఉంటాయి. ఉచితంగా వస్తున్నాయి కదా.. అని తొందరపడితే సమాచారం మొత్తం సైబర్‌ నేరగాళ్లకు చేరిపోతుంది. విండోస్‌ కోసం ఉచితంగా దొరికే సురక్షితమైన కొన్ని సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌ గురించి తెలుసుకుందాం... అయితే వాటిని డౌన్‌లోడ్‌ చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించాల్సిందే..

క్రోమియం బేస్‌డ్‌ బ్రౌజర్‌గా..

విండోస్‌ సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్స్‌ను చాలా వెబ్‌సైట్లు అందిస్తుంటాయి. అయితే భద్రమైన సోర్స్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుంటేనే ఉత్తమం. లేకపోతే మాల్‌వేర్‌, యాడ్‌వేర్‌తోపాటు ఇతర వైరస్‌లు దాడి చేసే అవకాశం ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్ల హోంపేజీల్లో దొరికే సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్స్‌ను క్లిక్‌ చేస్తే చాలు మాల్‌వేర్‌ వచ్చిపడిపోతుంది. అయితే ఒపెరా (Opera) సాఫ్ట్‌వేర్‌  వీటికి భిన్నంగా ఎంతో సురక్షితమైనది. క్రోమియం బేస్‌డ్‌ బ్రౌజర్‌ అయిన ఒపెరాను మైక్రోసాఫ్ట్‌ విండోస్, ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ మాక్‌ఓఎస్, లైనక్స్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌లో వినియోగించవచ్చు. మొబైల్‌ వెర్షన్స్ ఒపెరా, ఒపెరా టచ్‌, ఒపెరా మినితోపాటు అనేక బ్రౌజర్లను ఒపెరా విడుదల చేసింది. డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి


చాలా సులువుగా ఎంచుకునే అవకాశం.. 

విండోస్‌ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ చేసేందుకు నైనైట్ (Ninite) చాలా సులువుగా ఉపయోగపడుతుంది. సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్స్‌లో ఉండే ప్రోగ్రామ్‌ల జాబితాను నైనైట్‌ అందిస్తుంది. అందులో మనకు కావాల్సిన యాప్స్‌కు సంబంధించిన వివరాలను చెక్‌ చేసుకుని డౌన్‌లోడ్‌ బటన్‌ నొక్కేయడమే. దీంతో ఎంచుకున్న ప్రోగ్రామ్స్‌ ఫైల్స్‌ బల్క్‌గా డౌన్‌లోడ్‌ అయి ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. నైనైట్‌ సాఫ్ట్‌వేర్‌లో సమాచార రక్షణ, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అవనసరమైన టూల్‌బార్స్‌, జంక్‌ ఫైల్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌లో రన్‌ అయ్యే వాటిని డిక్లేన్‌ చేసేస్తుంది. ప్రతిసారి నెక్ట్స్‌ను క్లిక్‌ చేయాల్సిన అవసరం ఉండదని టెక్‌ నిపుణులు పేర్కొన్నారు. దీంతో మాల్‌వేర్‌ సమస్య ఉండదు. ఒరిజినల్‌ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్‌ చేసి ఇన్‌స్టాల్‌ చేసుకుంటే ఏదైనా అప్‌డేట్‌ అవుతుంది. డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి


ప్రతి రోజూ అప్‌డేట్‌ అవుతూనే.. 

అత్యధికంగా డౌన్‌లోడ్‌ చేసుకున్న సాఫ్ట్‌వేర్లలో సాఫ్ట్‌పిడియా(Softpedia) ఒకటి. దాదాపు మూడు వందల కోట్లకుపైగా డౌన్‌లోడ్‌లు అయినట్లు టెక్ వర్గాలు పేర్కొన్నాయి. సాఫ్ట్‌వేర్‌తోపాటు వచ్చే అన్ని అప్లికేషన్స్‌ ప్రతి రోజూ అప్‌డేట్‌ అవుతూనే ఉంటాయి. ఇలాంటి సమయంలోనూ మాల్‌వేర్‌రహిత సాఫ్ట్‌వేర్‌ సేవలను సాఫ్ట్‌పిడియా అందిస్తుండటం విశేషం. ఈజీ టు యూజ్‌ ఇంటర్‌ఫేస్‌ ఉండటంతో ఏ ప్లాట్‌ఫామ్‌పైనైనా సులువుగా బ్రౌజింగ్‌ చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో అప్‌డేట్‌ అయిన వాటిని బ్రౌజ్‌ చేయడం లేదా కేటగిరీలు, లాస్ట్‌ అప్‌డేటెడ్‌, విలువ ఆధారంగా శోధించే అవకాశం ఉంది. విండోస్‌తోపాటు మాక్, లైనక్స్, ఆండ్రాయిడ్‌ యాప్స్‌లోనూ వినియోగించుకోవచ్చు. డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి


విరివిగా వినియోగం.. 

ప్రస్తుత కాలంలో ఫైల్‌హిప్పో (FileHippo) సాఫ్ట్‌వేర్‌ను విరివిగా వినియోగించడం జరుగుతోంది. వందలాది యాక్టివ్‌ ప్రోగ్రామ్స్‌ను వివిధ కేటగిరీల్లో అందిస్తుంది ఫైల్‌హిప్పో సాఫ్ట్‌వేర్‌. సాఫ్ట్‌వేర్‌ను అప్‌లోడ్‌ చేసేటప్పుడు ఇతర అప్లికేషన్స్‌ గురించి అడుగుతుంది. స్పష్టంగా లేబుల్‌ చేసి ఉండటం వల్ల సులువుగా స్కిప్‌ చేసేసి సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. ఫైల్‌హిప్పో యూజర్లకు మరొక మంచి అవకాశం కల్పించింది. సాఫ్ట్‌వేర్‌ ఓల్డ్‌ వెర్షన్స్‌ కూడా ఆఫర్‌ చేయడం విశేషం. సాధారణంగా భద్రతా కారణాలరీత్యా ఔట్‌డేటెడ్‌ వెర్షన్స్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవడానికి ఆసక్తి చూపరు. అయితే ఇందులోనూ ఉపయోగకరమైన అంశం ఏంటంటే.. లేటెస్ట్‌ వెర్షన్‌తో ఏమైనా సమస్యలు తలెత్తితే పాత వెర్షన్‌ను వినియోగించుకునే అవకాశం ఉంది. డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి


డౌన్‌లోడ్‌ క్ర్యూ (Download Crew)

పూర్తి సమాచారం అంతా షార్ట్‌కట్‌లోనే డౌన్‌లోడ్‌ క్ర్యూ (Download Crew) వెబ్‌సైట్‌లో తెలియజేయడం విశేషం. డిస్క్రిప్షన్‌లో ఇచ్చే వివరాలన్నీ యూజర్లు రాసినవే. వెండర్స్‌ వెబ్‌సైట్‌ నుంచి కాపీ అండ్‌ పేస్ట్ కాకుండా నిక్కచ్చిగా నిజమైన యూజర్ల నుంచి అప్‌డేషన్స్‌ తీసుకోవడం విశేషం. వెబ్‌సైట్‌ టాప్‌లో కేటగిరీల వారీగా విండోస్, మాక్, లైనక్స్, ఐఫోన్‌, ఆండ్రాయిడ్‌ వంటివి కనిపిస్తాయి. ఉదాహరణకు విండోస్‌ను క్లిక్‌ చేయగానే ఫీచర్‌డ్‌ డౌన్‌లోడ్స్‌ కనిపిస్తుంది. ఏ రకమైన అప్లికేషన్స్‌నైనా విడివిడిగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి


సులువుగా.. వేగవంతంగా..

FileHorse సాఫ్ట్‌వేర్‌కు భారీ రిపోజిటరీ లేనప్పటికీ ఉత్తమమైన, ఉపయోగకరమైన ప్రోగ్రామ్‌లను నిల్వ చేయడంపై దృష్టిసారించింది. ప్రతి పేజీకి స్క్రీన్‌షాట్స్‌ ఉంటాయి. కాబట్టి యూజర్‌కు ఏమి కావాలో, వెర్షన్‌ గురించి వివరణ, మార్పులు, ఓల్డ్‌ వెర్షన్స్‌కు లింకులు వంటివి ఎన్నో తెలుసుకోవచ్చు. హోంపేజీలో లేటెస్ట్‌గా వచ్చిన సాఫ్ట్‌వేర్లు, ఎక్కువగా డౌన్‌లోడ్‌ అయిన సాఫ్ట్‌వేర్‌లను తెలియజేస్తుంది. అలాగే బ్రౌజర్స్, యాంటీ స్పేవేర్, ఎంపీ 3 అండ్‌ ఆడియో వంటి కేటగిరీలవారీగా కనిపిస్తాయి. డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి


ఫైల్‌పుమా (FilePuma)

ప్రాథమిక ఇంటర్‌ఫేస్‌ సులువుగా, సరళంగా ఉండేలా ఫైల్‌పుమా దృష్టి పెట్టింది. మీకు ఆసక్తిగా ఉండే సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌ను ఈజీగా ఎంచుకోవచ్చు. సాఫ్ట్‌వేర్లకు సంబంధించి అనేక కేటగిరీలు ఉన్నాయి. ప్రాచుర్యం పొందిన సాఫ్ట్‌వేర్లన్నీ హోంపేజీలోనే కనిపిస్తుండటం విశేషం. ఓల్డ్ వెర్షన్స్‌, స్క్రీన్‌షాట్స్‌ అనేవి ఉన్నాయి. అప్‌డేట్‌ డిటెక్టర్‌ అనే ఫీచర్‌ ఫైల్‌పుమా ప్రత్యేకం. వ్యక్తిగత కంప్యూటర్లలో సాఫ్ట్‌వేర్‌ కోసం ఇన్‌స్టాల్‌ అప్‌డేషన్‌ను చెక్ చేయడం సులువవుతుంది. అయితే విండోస్ 10కి అందుబాటులో లేకపోవడం గమనార్హం. డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి


ఇతర సైట్లలానే.. కాకపోతే కాస్త స్పెషల్‌

ఫీచర్ల పరంగా SnapFiles కూడా ఇతర సాఫ్ట్‌వేర్‌ డౌన్‌లోడ్‌ సైట్ల మాదిరిగా ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేకతలు దీనికి అదనపు ఆకర్షణలు తెచ్చాయి. అందులో ఒకటి ఫ్రీవేర్ పిక్‌.. దీని ద్వారా కంప్యూటర్‌లోని ఫైల్స్‌ను, ఫోల్డర్లను వేగంగా కనిపెట్టవచ్చు. అదేవిధంగా హోంపేజీలో మోర్‌ ఆప్షన్‌ను క్లిక్‌చేస్తే కొన్ని కేటగిరీలు కనిపిస్తాయి. ఇందులోని ర్యాండమ్ పిక్‌ ఆప్షన్ కూడా ఫైల్స్‌, ఫోల్డర్లను శోధనకు  పనికొస్తుంది. ఆప్లికేషన్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోకుండానే రన్‌ చేసుకోవాలంటే పోర్టబుల్‌ యాప్స్‌ ఆప్షన్‌ ఉపయోగపడుతుంది. డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి


మైక్రోసాఫ్ట్‌ కోసం..

 

మైక్రోసాఫ్ట్‌ వచ్చిన తర్వాత కంప్యూటర్‌ రంగంలో ఎన్నో పెనుమార్పులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే విండోస్‌ 10, మోడ్రన్‌ యాప్ప్ కోసం ప్రత్యేకంగా  మైక్రోసాఫ్ట్‌ స్టోర్‌ ఉన్నప్పటికీ అంత ప్రభావవంతంగా లేవని టెక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే ఇందులో కొన్ని ప్రయోజనాలు లేకపోలేదు. స్టోర్‌ అప్లికేషన్స్‌ వాటంతటవే అప్‌డేట్‌ అవుతుంటాయి. అవి శాండ్‌బాక్స్‌డ్‌ కావడంతో సిస్టమ్‌లోని ఇతరవాటిలోకి చొరబడువు. మైక్రోసాఫ్ట్‌ స్టోర్‌లో ఇష్టమైన అప్లికేషన్స్‌ ఉన్నాయో లేదో చెక్‌ చేసుకుని డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఉత్తమం. డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని