గూగుల్ కొత్త పాలసీ..ఏం చేయాలో తెలుసా..
కొద్దిరోజుల క్రితం గూగుల్ క్లౌడ్ స్టోరేజ్‌కు సంబంధించిన విదివిధానాల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. 2021 జూన్ 1 తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నట్లు తెలిపింది. దీంతో యూజర్స్‌లో ఒక్కసారిగా గూగుల్ ఉచితంగా అందించే క్లౌడ్ స్టోరేజ్‌పై చర్చ మొదలైంది...
ఇంటర్నెట్ డెస్క్: కొద్దిరోజుల క్రితం గూగుల్ క్లౌడ్ స్టోరేజ్‌కు సంబంధించిన విదివిధానాల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. 2021 జూన్ 1 తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నట్లు తెలిపింది. దీంతో యూజర్స్‌లో ఒక్కసారిగా గూగుల్ ఉచితంగా అందించే క్లౌడ్ స్టోరేజ్‌పై చర్చ మొదలైంది. ఈ నిర్ణయం ఎక్కువగా గూగుల్ ఫొటోస్పైనే ప్రభావం చూపనుంది. ఎందుకంటే ఇన్నాళ్లుగా గూగుల్ ఫొటోస్‌లో ఉచిత అన్లిమిటెడ్ స్టోరేజ్‌ని గూగుల్ అందిస్తోంది. తాజా నిర్ణయంతో 15జీబీ స్టోరేజ్ మాత్రమే యూజర్స్ ఉచితంగా పొందనున్నారు.
గూగుల్ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రతి రోజు ఎక్కువ మంది యూజర్స్ తమ డేటాను నిక్షిప్తం చేసేందుకు క్లౌడ్ స్టోరేజ్‌ను ఉపయోగిస్తున్నారట. సుమారుగా 4.3 మిలియన్ జీబీ డేటాను యూజర్స్ ప్రతి రోజూ గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫొటోస్, జీమెయిల్ క్లౌడ్ స్టోరేజ్‌లలో సేవ్ చేస్తున్నారట. ప్రస్తుతం క్లౌడ్ స్టోరేజ్ వినియోగానికి డిమాండ్ పెరుతుందనేందుకు ఇదే ఉదాహరణ అని గూగుల్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రతి యూజర్‌కి మెరుగైన క్లౌడ్ సేవలు అందించేందుకు తమ క్లౌడ్ స్టోరేజ్ విదివిధానాల్లో మార్పులు చేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. మరి గూగుల్ తాజా నిర్ణయం వల్ల యూజర్స్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది..ఒక వేళ క్లౌడ్ స్టోరేజ్ పరిమితికి మించితే ఏం చేయాలి వంటి సందేహాలకు సమాధానం కావాలంటే వీటిపై ఓ లుక్కేయండి..
అసలేంటి గూగుల్ కొత్త పాలసీ..
సాధారణంగా జీ మెయిల్ ఖాతా తెరిచినప్పుడు గూగుల్ 15జీబీ క్లౌడ్ స్టోరేజ్ ఉచితంగా కేటాయిస్తుంది. ఇందులో జీమెయిల్, డ్రైవ్, ఫొటోస్ నుంచి ఫైల్స్‌ని సేవ్ చేసుకోవచ్చు. అయితే ఇందులో గూగుల్ డాక్స్, గూగుల్ షీట్స్‌తో పాటు గూగుల్ సూట్లోని ఇతర యాప్స్ నుంచి స్టోర్ అయిన డేటాను కూడా 15జీబీలో భాగంగా పరిగణనలోకి తీసుకుంటుంది. కానీ, గూగుల్ ఫొటోస్ నుంచి స్టోర్ అయిన ఎక్కువ క్వాలిటీ కలిగిన ఫొటోలు, వీడియోలను క్లౌడ్ స్టోరేజ్‌లో భాగంగా పరిగణించదు. దీని వల్ల గూగుల్ ఫొటోస్‌లో క్లౌడ్ స్టోరేజ్‌ని యూజర్స్ ఉచితంగా పొందేవారు. అయితే 2021 జూన్ 1 తేదీ నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనతో గూగుల్ ఫొటోస్‌లో యూజర్స్ స్టోర్ చేసే ఫొటోలు, వీడియోలను కూడా 15జీబీ క్లౌడ్ స్టోరేజ్‌లో భాగంగా పరిగణించనుంది. దీని వల్ల యూజర్స్ ఇన్నాళ్లు పొందిన ఉచిత క్లౌడ్ స్టోరేజ్ 15జీబీకి పరిమితం కానుంది. దీంతో యూజర్స్ గూగుల్ అన్ని అప్లికేషన్స్‌కి కలిపి 15జీబీ క్లౌడ్ స్టోరేజ్‌ని మాత్రమే ఉచితంగా పొందనున్నారు.
దీని వల్ల యూజర్స్ ఏం కోల్పోతారు..
గూగుల్ తాజా నిర్ణయం ఫొటోస్ అప్లికేషన్ యూజర్స్‌పై ఎక్కువ ప్రభావం చూపనుంది. ఇన్ని రోజులు ఉచితంగా పొందిన సేవలను ఇక మీదట నెలవారి లేదా ఏడాది పాటు చందా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధన 2021 జూన్ 1 తేదీ నుంచి అమల్లోకి రానుంది. సాధారణంగా ఫొటోలు, వీడియోలు ఎక్కువ మెమొరీని ఆక్రమిస్తాయనే విషయం తెలిసిందే. దీంతో గూగుల్ విధించిన 15జీబీ ఉచిత స్టోరేజ్ పరిమితి దాటితే ఎక్కువ మెమొరీ కోసం యూజర్స్ నగదు చెల్లించాలి లేదా స్టోరేజ్ పరిమితి దాటకుండా చూసుకోవాలి. అయితే 2021 జూన్ 1 తేదీ వరకు స్టోర్ చేసుకున్న యూజర్స్‌పై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపదట. అంటే 2021 మే 31 వరకు యూజర్స్ గూగుల్ ఫొటోస్‌లో స్టోర్ చేసుకునే వారికి ఈ నిబంధన వర్తించదన్నమాట.
ఈ నిబంధన నుంచి ఎవరికి మినహాయింపు
గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్స్ నుంచి క్లౌడ్ స్టోరేజ్‌లోకి సేవ్ చేసుకునే ఫొటోలు, వీడియోలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. అలానే 2021 జూన్ 1 తేదీ తర్వాత గతంలో స్టోర్ చేసిన డాక్యుమెంట్స్ ఎడిట్ చేసి తిరిగి స్టోర్ చేసినా వాటికి కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ఒక వేళ గూగుల్ యూజర్స్ ఎవరైనా తమ ఫొటోలు, వీడియోలను క్లౌడ్ స్టోరేజ్‌లో సేవ్ చేసుకోవాలంటే 2021 మే 31 తేదీలోపు ఆ పని చెయ్యొచ్చు.
ఇంకా గూగుల్ ఏం చెయ్యనుందంటే..
కొత్త నిబంధన అమల్లోకి వచ్చాక గూగుల్ నుంచి క్లౌడ్ స్టోరేజ్ సబ్‌స్క్రైబ్ చేసుకున్న యూజర్స్ రెండు సంవత్సరాల వరకు ఏదైనా గూగుల్ సూట్లోని అప్లికేషన్స్‌లో లాగిన్ కాకుంటే సదరు అప్లికేషన్‌లోని డేటాను గూగుల్ డిలీట్ చేస్తుందట. అయితే సదరు డేటా తొలగించే ముందు యూజర్‌కి గూగుల్ ఒకటి కంటే ఎక్కువ సార్లు సమాచారాన్ని అందిస్తుంది. ఒక వేళ ఎప్పటికీ యూజర్ స్పందిచకుంటే డేటాను తొలగిస్తుంది. మరి డేటా డిలీట్ కాకుండా ఉండాలంటే రెండు సంవత్సరాలకొకసారి ప్రతి గూగుల్ అప్లికేషన్లో లాగిన్ అయితే సరిపోతుంది.
ఒక వేళ గడువులోపు స్టోరేజ్ పరిమితి దాటితే..
2021 జూన్ 1 తేదీలోపు 15జీబీ పరిమితి దాటిన యూజర్స్‌కి స్టోరేజ్ మేనేజ్మెంట్ టూల్స్‌ని గూగుల్ అందిస్తుంది. గూగుల్ వన్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా ఏయే కేటగిరీకి (ఫొటోస్, డ్రైవ్, జీమెయిల్) ఎంత మెమొరీ ఆక్రమించిందనేది ఇందులో చూసిస్తుంది. దాని ద్వారా అవసరం లేని ఫైల్స్‌ని సులభంగా డిలీట్ చేసుకోవచ్చు. అలానే 15జీబీ స్టోరేజ్‌ని మేనేజ్ చేసుకోవచ్చు. ఒక వేళ ఎక్కువ స్టోరేజ్ కావాలనుకునేవారు నెలవారీ చందా చెల్లించి స్టోరేజ్ కొనుగోలు చేసుకోవచ్చు. ఇందుకు 100జీబీ స్టోరేజ్‌కి నెలకు రూ. 130..ఏడాది సబ్‌స్క్రిప్షన్‌కి రూ. 1,300 చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ మీ డేటాను గూగుల్ నుంచి తీసుకోవాలనుకుంటే గూగుల్ టేక్అవుట్ ద్వారా పొందొచ్చు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ భద్రంగా..
స్మార్ట్ఫోన్లు ఇప్పుడు వ్యక్తిగత ఆస్తులు! పాస్వర్డ్లు, ఈమెయిళ్లు, బ్యాంకు వివరాల వంటి విలువైన సమాచారం మొత్తం వీటిల్లోనే స్టోర్ చేసుకుంటున్నాం మరి. ఇంతటి కీలకమైన ఫోన్లను భద్రంగా కాపాడుకోవద్దూ! -
కార్చిచ్చు కహానీ!
ప్రకృతి విపత్తులనగానే వరదలు, తుపాన్లు, కరవులు, సుడిగుండాల వంటివే గుర్తుకొస్తాయి. కానీ అడవులు మండటమూ తక్కువేమీ కాదు. ఇటీవల మన దగ్గర శేషాచలం అడవుల్లో, ఉత్తరాఖండ్‌లో కార్చిచ్చు రేగటం తెలిసిందే. -
మెదడులాంటి కంప్యూటర్!
మనిషి మెదడులా పనిచేసే, ఒకే సమయంలో వేర్వేరుగా స్పందించే కంప్యూటర్లను రూపొందించాలని చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ దిశగా ఇంటెల్ శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద న్యూరోమార్ఫిక్ కంప్యూటర్ను రూపొందించారు. -
దైవకణం కథ
అది అన్ని కణాలకూ ద్రవ్యరాశిని సంతరింపజేస్తుంది. దీని గురించి 1960ల్లోనే తెలిసినా 50 ఏళ్ల తర్వాత గానీ ఉనికి బయటపడలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద, అతి సంక్లిష్ట యంత్రం సాయం తీసుకుంటే తప్ప అది సాధ్యం కాలేదు. -
కాల మహిమ
ఉగాది రోజు పంచాంగం విన్నారా? దీనిలోని తిథులు, రోజులు, పక్షాలు, నెలలు, రుతువులు.. అన్నీ కాల గమన సంకేతాలే. అసలు కాలమంటే ఏంటి? అది ఎలా మొదలైంది? ఇలాగే కొనసాగుతుందా? అంతమవుతుందా? -
కంప్యూటర్‌కు బుర్ర!
మన మెదడు అద్భుతమైంది. హేతుబద్ధంగా వ్యవహరిస్తుంది. కార్య కారణాలను విశ్లేషించి ఒక నిర్ణయానికి వస్తుంది. ఉచితానుచితాలను బేరీజు వేస్తుంది. ఏ పని ఎలా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో పసిగడుతుంది. -
ఫోన్ ట్యాప్ అయ్యిందా?
నేటి డిజిటల్ యుగంలో వ్యక్తిగత సమాచార గోప్యత, భద్రత అతి కీలకమయ్యాయి. అధునాతన నిఘా పద్ధతుల నేపథ్యంలో ఇవి మరింత ప్రాధాన్యం సంతరించు కుంటున్నాయి. నిత్య జీవితంలో విడదీయలేని పరికరంగా మారిన ఫోన్ల మీదా నిఘా వేయటం, ట్యాపింగ్ చేయటమూ చూస్తున్నాం. -
రోబో సేవలు చేసేనే..
మనిషికి మనిషి తోడంటారు. ఇప్పుడు మర మనిషీ (రోబో) చేయందిస్తోంది. ఒకపక్క అధునాతన హ్యూమనాయిడ్ రోబోల వెల్లువ సంచలనం సృష్టిస్తుండగా.. మరోపక్క మామూలు రోబోలూ సేవలకు సిద్ధమవుతున్నాయి. -
మానవ రోబో దండు!
రోబో అనగానే ఏం గుర్తుకొస్తుంది? లోహ చట్రంతో కదిలే మర యంత్రమో, కదిలే లోహం బొమ్మో మదిలో కదలాడుతుంది. రబ్బరు కండరాలతో చేసినదైతే మనిషి మాదిరిగానూ కనిపిస్తుంది. చూపు, మాట మనిషిని పోలి ఉంటాయి. -
paul alexander: ఇనుప ఊపిరితిత్తి!
ఓ పొడవైన పెట్టె. శరీరమంతా అందులోనే. తల మాత్రమే బయటకు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 72 ఏళ్లు అందులోనే గడిపితే? అమెరికాకు చెందిన పాల్ అలెగ్జాండర్ అలాగే గడిపారు -
గూగుల్ సెర్చ్ తెలివిగా..
స్మార్ట్ఫోన్లలో గూగుల్ సెర్చ్‌ను వాడనివారుండరంటే అతిశయోక్తి కాదు. కానీ తేలికగా, త్వరగా ఆయా అంశాలను శోధించటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయనే సంగతి తెలుసా? అలాంటి కొన్ని ఉపాయాల గురించి తెలుసుకుందాం. -
భళారే డిజిటల్ విచిత్రం!
ఒకప్పటి కన్నా స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల సామర్థ్యం, వేగం పుంజుకున్న మాట నిజం. కానీ ఆకారంలో పెద్దగా మారింది లేదు. ఒకసారి అంచులు చిన్నగా.. మరోసారి కెమెరా బంప్‌లు పెద్దగా ఉండటం తప్పించి దాదాపు అలాగే కనిపిస్తుంటాయి. -
కృత్రిమ మేధ గుండె కాయ
కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎక్కడ చూసినా ఈ పేరే మార్మోగుతోంది. -
ఇక ఏఐ సినిమా!
పదాల కూర్పు ఆధారంగా చిటికెలో ఫొటోలు, చిత్రాలు, సంగీతం, పాటలను పుట్టిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) మరో అడుగు ముందుకేసింది. ఏకంగా వీడియోలనూ సృష్టించే స్థాయికి చేరుకుంది. విప్లవాత్మక ఛాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్ఏఐ సంస్థ కొత్తగా తీసుకొచ్చిన జనరేటివ్ కృత్రిమ మేధ (జెన్ఏఐ) మోడలే దీనికి నిదర్శనం. -
ఈ విశ్వ కిరణాలు..
విశ్వ కిరణాలు.. కాస్మిక్ రేస్. అంతరిక్షం ఆవలి నుంచి దూసుకొచ్చే ఇవి నిరంతరం అతి వేగంగా.. దాదాపు కాంతి వేగంతో సమానంగా విశ్వమంతటా ప్రయాణిస్తుంటాయి. వీటి మీద మొదటి నుంచీ శాస్త్రవేత్తలకు ఎంతో ఆసక్తి. ఎందుకంటే అంతరిక్షంలో పుట్టుకొచ్చిన చోటు, ఢీకొట్టిన వస్తువులను బట్టి ఇవి విశ్వానికి సంబంధించిన ఎన్నో విషయాలను వివరిస్తాయి. -
ప్రేమ శాస్త్రం!
ప్రేమ ఎందుకు పుడుతుందో, ఎవరి మీద పుడుతుందో తెలియదు. ఒకరికి నచ్చిన వ్యక్తి మరొకరికి నచ్చకపోవచ్చు. ఒకరికి అసలే నచ్చనివారు మరొకరికి ప్రాణం కన్నా మిన్నగా అనిపించ్చొచ్చు. -
ఫోల్డర్ మాయలు
విండోస్ పీసీలో రోజూ ఫోల్డర్లను వాడుతూనే ఉంటాం. కొత్త ఫైళ్లను స్టోర్ చేయటం, డేటాను వరుసగా పెట్టుకోవటం.. ఇలా ఎన్నింటికో వీటిని ఉపయో గిస్తుంటాం. మరి అదృశ్య ఫోల్డర్‌ను సృష్టించుకోగలరా? ఒకేసారి బోలెడన్ని ఫోల్డర్ల పేర్లను మార్చుకోగలరా? ఖాళీ ఫోల్డర్లను గుర్తించగలరా? ఇలాంటి కొన్ని చిత్రమైన ఫోల్డర్ చిట్కాల గురించి తెలుసుకుందాం. -
అమెజాన్ అడుగున బంగారు నేల
అమెజాన్ అనగానే దట్టమైన అడవులే గుర్తుకొస్తాయి. మనుషులు దూరటానికి వీల్లేని అక్కడ ఒకప్పుడు పెద్ద పట్టణమే ఉండేదని ఇటీవల తేలటం అందరినీ ఆశ్చర్యపరచింది -
ఏఐ టెక్కులు!
అసలే కృత్రిమ మేధ (ఏఐ) యుగం. ఆపై ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్ వస్తు ప్రదర్శన. ఇక చెప్పేదేముంది? ఏ పరికరాన్ని చూసినా ఏఐమయమే. హెల్త్ ట్రాకర్ల దగ్గరి నుంచి వాహనాల వరకూ అన్నింటికీ అదే ఆలంబన. -
Cyber Crime: నయా సైడర్!
నేటి సైబర్ యుగంలో నేరాలూ మారిపోతున్నాయి. ఆన్లైన్ మోసాలు కోకొల్లలు. డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు చోరీ చేసి మన ప్రమేయమేమీ లేకుండానే నేరగాళ్లు షాపింగ్ చేయటం తెలిసిందే -
కొత్త టెక్ లోకం
డిజిటల్ పరిణామం ఆగేది కాదు. ఇదో నిరంతర ప్రక్రియ. గత ఏడాదిని గతి తిప్పిన ట్రెండ్స్ కొత్త సంవత్సరాన్నీ పరుగులు తీయించనున్నాయి. మెషిన్ ఇంటెలిజెన్స్ జోరందుకోనుంది. వాస్తవ, కాల్పనిక ప్రపంచాల మధ్య హద్దులు చెరగటం ఖాయంగా కనిపిస్తోంటే.. నిరంతర అంతర్జాల పరిణామ ప్రక్రియ మన జీవితాలను గణనీయంగా శాసించేలా రూపుదిద్దుకుంటోంది.
తాజా వార్తలు (Latest News)
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
-
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్తా మేనన్
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
ఈడీ ఛార్జ్‌షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
-
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు