ఐడియా ప్యాడ్‌...

బడ్జెట్‌లో ఏదైనా నోట్‌బుక్‌ని కొందాం అనుకుంటే లెనోవో కొత్తగా అందుబాటులోకి తెచ్చిన...

Updated : 09 Dec 2022 12:52 IST

తాజాగా!
డ్జెట్‌లో ఏదైనా నోట్‌బుక్‌ని కొందాం అనుకుంటే లెనోవో కొత్తగా అందుబాటులోకి తెచ్చిన IDEAPAD 100S గురించి తెలుసుకోవాల్సిందే. 11.6 అంగుళాల తెరతో నాజూకుగా తీర్చిదిద్దారు. రిజల్యూషన్‌ 1366X768 పిక్సల్స్‌. విండోస్‌ 10 

హోం ఆపరేటింగ్‌ సిస్టంని బిల్ట్‌ఇన్‌గా అందిస్తున్నారు. Intel Atom Z3735F Quad-Core ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 2 జీబీ. స్టోరేజ్‌ సామర్థ్యం 32 జీబీ. మైక్రోఎస్‌బీ కార్డ్‌తో మెమొరీ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. 0.3 మెగాపిక్సల్‌ వెబ్‌ కెమెరాతో పాటు డ్యూయల్‌ మైక్రోఫోన్‌లను నిక్షిప్తం చేశారు. Dolby Advanced స్పీకర్లతో ఆడియో వినొచ్చు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే సుమారు 8 గంటల పాటు వెబ్‌ బ్రౌజింగ్‌ చేయవచ్చు. బ్లూటూత్‌, వై-ఫై నెట్‌వర్క్‌లను సపోర్ట్‌ చేస్తుంది. రెండు యూఎస్‌బీ 2.0 పోర్ట్‌లు, హెచ్‌డీఎంఐ అవుట్‌, మైక్రోఎస్‌బీ కార్డ్‌ స్లాట్‌, హెడ్‌ఫోన్‌ జాక్‌ ఉన్నాయి. మరో ప్రత్యేక ఆఫర్‌ ఏంటంటే... ఏడాది పాటు ‘మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ 365’ సర్వీసుని ఉచితంగా వాడుకోవచ్చు. దీంతో పాటు 1 టీవీ వన్‌డ్రైవ్‌ క్లౌడ్‌ స్టోరేజ్‌ని పొందొచ్చు. దేశీయ మార్కెట్‌లో నోట్‌బుక్‌ ధర రూ.14,499. శ్నాప్‌డీల్‌ ఆన్‌లైన్‌ అంగడి నుంచి కొనుగోలు చేయవచ్చు.

ఇతర వివరాలకు http://goo.gl/NUoVGf

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు