విద్యుత్తు అవసరం లేని ఫ్రిజ్‌!

ఎలాంటి విద్యుత్తు అవసరం లేదు. కొద్దిపాటి నీరుంటే చాలు. చల్లబరిచేస్తుంది. ఇలాంటి వినూత్న శీతలీకరణ వ్యవస్థనే రూపొందించారు ఎంఐటీ పరిశోధకులు. ఒకరకంగా దీన్ని కొత్తరకం ఫ్రిజ్‌ అనుకోవచ్చు. ఇది ఆహార పదార్థాలు చెడిపోకుండా చూడటమే

Updated : 28 Sep 2022 10:57 IST

ఎలాంటి విద్యుత్తు అవసరం లేదు. కొద్దిపాటి నీరుంటే చాలు. చల్లబరిచేస్తుంది. ఇలాంటి వినూత్న శీతలీకరణ వ్యవస్థనే రూపొందించారు ఎంఐటీ పరిశోధకులు. ఒకరకంగా దీన్ని కొత్తరకం ఫ్రిజ్‌ అనుకోవచ్చు. ఇది ఆహార పదార్థాలు చెడిపోకుండా చూడటమే కాదు.. ఇళ్లలో సంప్రదాయ ఏసీలకు ప్రత్యామ్నాయంగానూ ఉపయోగపడగలదని భావిస్తున్నారు. చూడటానికి సౌర ఫలకం మాదిరిగా కనిపించే దీనిలో మూడు పొరలుంటాయి. పైపొరను ఏరోజెల్‌, మధ్యపొరను రంధ్రాలతో కూడిన హైడ్రోజెల్‌, అడుగు పొరను అద్దంలాంటి పదార్థంతో తయారుచేశారు. వీటి మధ్య నుంచి నీరు, వేడి ప్రసారమయ్యే క్రమంలో చల్లదనాన్ని కలగజేస్తుంది. వికిరణ శీతలీకరణ, ఆవిరి శీతలీకరణ, వేడి వ్యాప్తి నిరోధక వ్యవస్థలతో కూడిన ఇది సుమారు 9.3 డిగ్రీల సెల్షియస్‌ ఉష్ణోగ్రత వరకు చల్లబరుస్తుంది. ఈ పరికరాన్ని మందులు, పదార్థాల వంటి వాటి మీద లేదా చుట్టుపక్కలనైనా పెట్టొచ్చు. ఉష్ణోగ్రతను చల్లబరచటం ద్వారా ఇది వాటిని ఎక్కువసేపు సురక్షితంగా ఉంచుతుంది.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని