వాట్సప్ గ్రూప్స్‌లో చర్చించుకుందాం రా!
ఎక్స్(ట్విటర్)లో స్పేసెస్ మాదిరిగా వాట్సప్ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. దీని పేరు వాయిస్ చాట్. ఇది వాట్సప్ బీటా టెస్టర్లకు ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది
ఎక్స్(ట్విటర్)లో స్పేసెస్ మాదిరిగా వాట్సప్ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. దీని పేరు వాయిస్ చాట్. ఇది వాట్సప్ బీటా టెస్టర్లకు ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. గ్రూపులో సభ్యులంతా కలిసి మాట్లాడుకోవటానికిది వీలు కల్పిస్తుంది. వాట్సప్‌లో గ్రూప్ కాల్ ఫీచర్ ఉందిగా అనుకుంటున్నారా? ఇది గ్రూపులో ప్రతి ఒక్కరికీ కాల్ చేస్తుంది. కొత్త వాయిస్ ఛాట్స్ అలా కాదు. సభ్యులకు సైలెంట్‌గా నోటిఫికేషన్ పంపిస్తుంది. గ్రూప్ కాల్స్‌లో సభ్యులను మనమే జత చేయాల్సి ఉంటుంది. కానీ వాయిస్ ఛాట్స్‌లో బృంద సభ్యులు ఎప్పుడంటే అప్పుడు జాయిన్ కావొచ్చు లేదా బయటకు రావొచ్చు. బృందంలో ఎవరైనా వాయిస్ ఛాట్‌ను మొదలెడితే గ్రూపు చిహ్నం దానంతటదే తరంగం గుర్తు నుంచి కనెక్ట్ బటన్‌గా మారిపోతుంది. ఇతరులకు భంగం కలిగించొద్దని భావించేవారికిది మంచి సదుపాయం. దీని ద్వారా ఒకేసారి 32 మంది మాట్లాడుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nara Lokesh: 29 నుంచి లోకేశ్ పాదయాత్ర తిరిగి ప్రారంభం
-
Demat nominee: డీమ్యాట్ ఖాతాలకు నామినీ గడువు పొడిగింపు
-
Padmanabha reddy: రూ.10వేల కోట్లు ఫ్రీజ్ చేయండి: సీఈసీకి పద్మనాభరెడ్డి లేఖ
-
Harish Rao: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉన్నాం.. ఆందోళన వద్దు: మంత్రి హరీశ్‌రావు
-
ChatGPT: చాట్‌జీపీటీ ఇక వింటుందీ చూస్తుంది.. కొత్త ఫీచర్లు వారికి మాత్రమే!
-
CM Jagan: ‘ఎందుకు ఆంధ్రాకు జగనే కావాలి’.. కార్యక్రమం చేపట్టాలని సీఎం ఆదేశం