జీమెయిల్‌లోనూ ఎమోజీలు

వాట్సప్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో ఎమోజీలతో ప్రతిస్పందనలు తెలియజేయటం మామూలే. ఇప్పుడివి జీమెయిల్‌కూ విస్తరించనున్నాయి

Published : 11 Oct 2023 00:25 IST

వాట్సప్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో ఎమోజీలతో ప్రతిస్పందనలు తెలియజేయటం మామూలే. ఇప్పుడివి జీమెయిల్‌కూ విస్తరించనున్నాయి. ముందు ఆండ్రాయిడ్‌ ఫోన్లలో జీమెయిల్‌ యాప్‌లో అందుబాటులోకి రానున్నాయి. క్రమంగా వెబ్‌, ఏఓఎస్‌ యూజర్లకు విస్తరించనున్నారు. ఎమోజీలతో మనలోని భావాలను ఈమెయిల్‌ పంపినవారికి సత్వరం తెలియజేయొచ్చు. వెంటనే మెయిల్‌కు ప్రత్యుత్తరం ఇవ్వటం సాధ్యం కానప్పుడివి బాగా ఉపయోగపడతాయి. ఎమోజీ రియాక్షన్స్‌ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చినవారు వీటిని వాడుకోవచ్చు. ఈమెయిల్‌ దిగువన ‘యాడ్‌ ఎమోజీ రియాక్షన్‌’ బటన్‌ కనిపిస్తుంది. దీని ద్వారా ఇష్టమైన బొమ్మను ఎంచుకొని జతచేయొచ్చు. గ్రూప్‌ ఈమెయిళ్లకయితే ఎవ్రీవన్స్‌ రియాక్షన్స్‌ ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే గ్రూపులో 20 కన్నా ఎక్కువమంది ఉంటే ఇది పనిచేయదు. ఎమోజీల రూపంలో స్పందించిందెవరో తెలుసుకోవాలంటే దాని మీద కాసేపు నొక్కి పట్టాలి. కావాలనుకుంటే అదే స్పందనను గ్రూపులోని ఇతరులకూ పంపించొచ్చు. మోర్‌ మోర్‌ బటన్‌ మీద నొక్కి థ్రెడ్‌లో ఉన్న ఏ మెసేజ్‌కైనా ఎమోజీని జతచేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని