తాత్కాలిక మెయిల్‌ కోసం

ఖాళీ సమయంలో గిగ్‌ ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తుండొచ్చు. మరేదైనా అవసరం కోసమో ఈమెయిల్‌ ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తొచ్చు. అయితే అదంత ముఖ్యమైన వ్యవహారం కాకపోవచ్చు.

Published : 03 Jan 2024 00:08 IST

ఖాళీ సమయంలో గిగ్‌ ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తుండొచ్చు. మరేదైనా అవసరం కోసమో ఈమెయిల్‌ ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తొచ్చు. అయితే అదంత ముఖ్యమైన వ్యవహారం కాకపోవచ్చు. ఇలాంటి సమయంలో డిస్పోజబుల్‌ ఈమెయిల్‌ అడ్రస్‌ బాగా ఆదుకుంటుంది. ప్రధాన ఈమెయిల్‌ ఐడీ ఇవ్వకుండా తాత్కాలిక ఐడీతోనే పనులు చక్కబెట్టుకోవచ్చు. స్పామ్‌ మెసేజ్‌ల బెడద నుంచి తప్పించుకోవచ్చు. ఇందుకోసం కొత్తగా మెయిల్‌ ఐడీని సృష్టించుకోవాల్సిన పనేమీ లేదు. జీమెయిల్‌ అడ్రస్‌లో @ గుర్తుకు ముందు ప్లస్‌, దీని తర్వాత ఏదైనా పదం లేదా అంకెను చేరిస్తే చాలు. ఉదాహరణకు- మీ ఈమెయిల్‌ ఐడీ  BodeHydParty@gmail.com  అనుకోండి. దీనికి బదులు  BodeHydParty+OnlineJuryDuty@gmail.com అని రాసుకోవచ్చు.

  • యాపిల్‌ ఐ క్లౌడ్‌ ప్లస్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్నవారు హైడ్‌ మై ఈమెయిల్‌ ఫీచర్‌ను వాడుకోవచ్చు.  @icloud.com కు ముందు తాత్కాలిక ఐడీని రాసుకోవచ్చు.
  • మరీ అవసరమైతే టెంప్‌ మెయిల్‌, 10మినట్‌మెయిల్‌ వంటి వెబ్‌సైట్లనూ వాడుకోవచ్చు. ఇవి తాత్కాలిక ఈమెయిళ్లను సృష్టించుకోవటానికి వీలు కల్పిస్తాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని