Browser Extentions: బ్రౌజర్ నుంచి ఎక్స్టెన్షన్లు ఎలా తొలగించాలంటే..?
ఆన్లైన్ విహారం ఎలాంటి టెన్షన్ లేకుండా పూర్తవ్వాలంటే ఎక్స్టెన్షన్ సాయం తీసుకోవాల్సిందే. మరి బ్రౌజర్లో మనకు అవసరంలేని ఎక్స్టెన్షన్లు ఎలా తొలగించాలలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్‌డెస్క్: స్మార్ట్ఫోన్లకు యాప్‌లు ఉన్నట్లుగానే.. బ్రౌజర్‌కు ఎక్స్టెన్షన్లు పనిచేస్తాయి. ఆన్లైన్ విహారం ఎలాంటి టెన్షన్ లేకుండా పూర్తవ్వాలంటే ఎక్స్టెన్షన్ సాయం తీసుకోవాల్సిందే. యూజర్ అవసరాలకు తగినట్లుగా ఎప్పటికప్పుడు కొత్త ఎక్స్టెన్షన్లు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. అయితే ఎక్కవ ఎక్స్టెన్షన్ల వినియోగం బ్రౌజర్ పనితీరును నెమ్మదింపజేస్తుంది. అలానే చాలా కాలం నుంచి అప్డేట్ కానీ ఎక్స్టెన్షన్లు మీ బ్రౌజర్‌పై సైబర్ దాడికి కారణం కావచ్చు. అంతేకాదు కొన్ని రకాల ఎక్స్టెన్షన్ల ద్వారా యూజర్ డేటా హ్యాకర్స్ చేతికి చిక్కే ప్రమాదం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే అవసరమైన ఎక్స్టెన్షన్లను మాత్రమే ఉపయోగించాలని సూచిస్తున్నారు. మరి ఎక్స్టెన్షన్లు తొలగించేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? వేర్వేరు బ్రౌజర్ల నుంచి ఎక్స్టెన్షన్లు ఎలా తొలగించాలనేది తెలుసుకుందాం.
💻 నెల రోజులు, అంతకు మించి ఏదైనా ఎక్స్టెన్షన్ ఉపయోగించకుంటే దాన్ని తొలగించగటం మేలంటున్నారు సైబర్ నిపుణులు.
💻 బ్రౌజర్ అప్డేట్ చేసినప్పుడు కొన్ని రకాల కొత్త ఫీచర్లు యూజర్లకు అందుబాటులోకి వస్తాయి. దాంతో అప్పటిదాకా మీరు ఉపయోగిస్తున్న ఎక్స్టెన్షన్ల అవసరం ఉండదు. అలానే బ్రౌజర్ సపోర్ట్ చేయకపోవడం వల్ల కొన్ని ఎక్స్టెన్షన్లు పనిచేయకపోవచ్చు. అలాంటప్పుడు వాటిని తొలగిస్తే మేలు.
💻 ఇంటర్నెట్ డేటా ఆదా చేసేందుకు చాలా మంది ఇంటర్నెట్ సేవింగ్ ఎక్స్టెన్షన్లను ఉపయోగిస్తుంటారు. అయితే మీరు చేసే బ్రౌజింగ్‌తో పోల్చినప్పుడు కేవలం ఒక్క క్లిక్కు అవసరమైన డేటాను ఆదా చేసే ఎక్స్టెన్షన్లు బ్రౌజర్లో ఉంచకోవాల్సిన అవసరం లేదంటున్నారు సైబర్ నిపుణులు. భద్రతపరంగా వాటిలో లోపాలుంటే మీ డేటా మొత్తం హ్యాకర్ల చేతికి చేరిపోవచ్చు. అందుకే డేటా సేవింగ్ పేరుతో ఉండే ఎక్స్టెన్షన్ల జోలికి పోవద్దు.
డిసేబుల్ - రిమూవ్.. రెండింటిలో ఏది?
బ్రౌజర్లోని కొన్ని ఎక్స్టెన్షన్లలో రిమూవ్తోపాటు, డిసేబుల్ ఆప్షన్ కూడా ఉంటుంది. దాంతో చాలా మంది యూజర్స్ అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చనే కారణంతో డిసేబుల్ చేసి వాటిని బ్రౌజర్లో ఉంచేస్తారు. నెలకోసారి ఉపయోగించే ఎక్స్టెన్షన్లలో ఈ పద్ధతి సరైనదే. అలానే మీరు ఉపయోగించని వాటిని తొలగిస్తే, అందులోని మీ డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. ఒకవేళ ఎక్స్టెన్షన్ సరిగా పనిచేయకున్నా, దాన్ని ఉపయోగించకున్నా తొలగించడమే మేలంటున్నారు సైబర్ నిపుణులు. అలాంటి వాటిని బ్రౌజర్లో ఉంచుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగంలేదంటున్నారు.
గూగుల్ క్రోమ్ (Google Chrome)
క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి పైభాగంలో కుడివైపు చివరన మూడు చుక్కలపై క్లిక్ చేస్తే మెనూ కనిపిస్తుంది. అందులో మోర్ టూల్స్‌పై క్లిక్ చేస్తే ఎక్స్టెన్షన్స్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేస్తే మీ బ్రౌజర్లో ఉన్న ఎక్స్టెన్షన్స్ కనిపిస్తాయి. వాటిలో మీకు అవసరంలేనివి, చాలా కాలం నుంచి ఉపయోగించని వాటిని ఎంపిక చేసుకోవాలి. తర్వాత వాటిపై ఉండే రిమూవ్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే సదరు ఎక్స్టెన్షన్ బ్రౌజర్ నుంచి డిలీట్ అయిపోతుంది. అలానే మీరు తరచుగా ఉపయోగించని ఎక్స్‌టెన్షన్‌ను తొలగించకూడదనుకుంటే పక్కనే ఉన్న డిసేబుల్ బటన్‌పై క్లిక్ చేస్తే అది మీకు బ్రౌజర్ పేజీలో కనిపించదు. తర్వాత మీకు అవసరమైనప్పుడు వాటిని ఎనేబుల్ చేస్తే ఎప్పటిలానే ఉపయోగించుకోవచ్చు.
మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ (Microsoft Edge)
గూగుల్ క్రోమ్ తరహాలోనే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ నుంచి ఎక్స్టెన్షన్లను ఎంతో సులువుగా తొలగించవచ్చు. బ్రౌజర్ కుడివైపు పైభాగంలో ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేస్తే మెనూ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో ఎక్స్టెన్షన్స్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి మేనేజ్ ఎక్స్టెన్షన్ (Manage Extentions)పై క్లిక్ చేయాలి. తర్వాత ఎక్స్టెన్షన్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో అవసరంలేని ఎక్స్‌టెన్షన్స్‌ను డిలీట్ చేసేందుకు రిమూవ్ ఆప్షన్, బ్రౌజర్ పేజ్‌పై కనిపించకుండా చేసేందుకు డిసేబుల్, ఎనేబుల్ ఆప్షన్లు ఉంటాయి.
యాపిల్ సఫారీ (Apple Safari)
సఫారీ బ్రౌజర్లో ప్రివరెన్సెన్స్(Preferences)లోకి వెళ్లి ఎక్స్టెన్షన్స్ టాబ్‌పై క్లిక్ చేయాలి. డిలీట్ చేయాలనుకుంటున్న ఎక్ష్టెన్షన్పై క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ చేయొచ్చు. అయితే సఫారీ ఎక్స్‌టెన్షన్స్‌లో కొన్ని మ్యాక్ కంప్యూటర్లలో ఉండే యాప్‌లకు అనుబంధంగా ఉంటాయి. కాబట్టి ఎక్స్టెన్షన్స్ తొలగించే ముందు అవి ఏదైనా యాప్‌కు అనుబంధంగా ఉన్నాయా..లేదా అనేది సరిచూసుకుని అన్ఇన్స్టాల్ చేయాలి.
మొజిల్లా ఫైర్ఫాక్స్ (Mozilla Firefox)
ఇందులో కూడా బ్రౌజర్ పేజీ ఓపెన్ చేసిన తర్వాత కుడివైపు చివర పైన ఉన్న మూడు గీతలపై క్లిక్ చేయాలి. అందులో యాడ్-ఆన్స్ అండ్ థీమ్స్ (Ctrl + Shift + A) ఓపెన్ చేస్తే మీ బ్రౌజర్లో ఉన్న ఎక్స్టెన్షన్స్ జాబితా కనిపిస్తుంది. వాటిలో మీకు అవసరంలేని వాటిని డిసేబుల్ చేస్తే బ్రౌజర్ నుంచి డిలీట్ అయిపోతాయి. ఒకవేళ వాటిని ప్రస్తుతం ఉపయోగించకుండా, భవిష్యత్తు అవసరాల కోసం అట్టిపెట్టుకోవాలనుకుంటే ఆన్ లేదా ఆఫ్ చేయొచ్చు. అలానే థీమ్స్, ప్లగిన్స్ కూడా యాడ్-ఆన్స్ పేజీలోనే ఉంటాయి.
ఒపెరా (Opera)
కంప్యూటర్లో ఒపెరా బ్రౌజర్ ఓపెన్ చేయాలి. తర్వాత ఒపెరా లోగోపై క్లిక్ చేస్తే మెనూ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో ఎక్స్టెన్షన్ (Ctrl+Shift+E)పై క్లిక్ చేయాలి. తర్వాత ట్యాబ్‌లో ఎక్స్‌టెన్షన్స్‌తో కూడిన జాబితా కనిపిస్తుంది. వాటిలో ఏదైనా ఎక్స్‌టెన్షన్‌ను డిలీట్ చేయాలనుకుంటే ‘X’ మార్క్‌పై క్లిక్ చేయాలి. ఒకవేళ ఎక్స్టెన్షన్ బ్రౌజర్ పేజ్‌లో కనిపించకూడదనుకుంటే డిసేబుల్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. అలానే బ్రౌజర్ పేజ్‌లో ఉండే ఎక్స్టెన్షన్స్ కోసం కుడివైపు పైభాగంలో బాక్స్ ఐకాన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే ఎక్స్టెన్షన్స్ జాబితా కనిపిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మెదడులాంటి కంప్యూటర్!
మనిషి మెదడులా పనిచేసే, ఒకే సమయంలో వేర్వేరుగా స్పందించే కంప్యూటర్లను రూపొందించాలని చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ దిశగా ఇంటెల్ శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద న్యూరోమార్ఫిక్ కంప్యూటర్ను రూపొందించారు. -
దైవకణం కథ
అది అన్ని కణాలకూ ద్రవ్యరాశిని సంతరింపజేస్తుంది. దీని గురించి 1960ల్లోనే తెలిసినా 50 ఏళ్ల తర్వాత గానీ ఉనికి బయటపడలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద, అతి సంక్లిష్ట యంత్రం సాయం తీసుకుంటే తప్ప అది సాధ్యం కాలేదు. -
కాల మహిమ
ఉగాది రోజు పంచాంగం విన్నారా? దీనిలోని తిథులు, రోజులు, పక్షాలు, నెలలు, రుతువులు.. అన్నీ కాల గమన సంకేతాలే. అసలు కాలమంటే ఏంటి? అది ఎలా మొదలైంది? ఇలాగే కొనసాగుతుందా? అంతమవుతుందా? -
కంప్యూటర్‌కు బుర్ర!
మన మెదడు అద్భుతమైంది. హేతుబద్ధంగా వ్యవహరిస్తుంది. కార్య కారణాలను విశ్లేషించి ఒక నిర్ణయానికి వస్తుంది. ఉచితానుచితాలను బేరీజు వేస్తుంది. ఏ పని ఎలా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో పసిగడుతుంది. -
ఫోన్ ట్యాప్ అయ్యిందా?
నేటి డిజిటల్ యుగంలో వ్యక్తిగత సమాచార గోప్యత, భద్రత అతి కీలకమయ్యాయి. అధునాతన నిఘా పద్ధతుల నేపథ్యంలో ఇవి మరింత ప్రాధాన్యం సంతరించు కుంటున్నాయి. నిత్య జీవితంలో విడదీయలేని పరికరంగా మారిన ఫోన్ల మీదా నిఘా వేయటం, ట్యాపింగ్ చేయటమూ చూస్తున్నాం. -
రోబో సేవలు చేసేనే..
మనిషికి మనిషి తోడంటారు. ఇప్పుడు మర మనిషీ (రోబో) చేయందిస్తోంది. ఒకపక్క అధునాతన హ్యూమనాయిడ్ రోబోల వెల్లువ సంచలనం సృష్టిస్తుండగా.. మరోపక్క మామూలు రోబోలూ సేవలకు సిద్ధమవుతున్నాయి. -
మానవ రోబో దండు!
రోబో అనగానే ఏం గుర్తుకొస్తుంది? లోహ చట్రంతో కదిలే మర యంత్రమో, కదిలే లోహం బొమ్మో మదిలో కదలాడుతుంది. రబ్బరు కండరాలతో చేసినదైతే మనిషి మాదిరిగానూ కనిపిస్తుంది. చూపు, మాట మనిషిని పోలి ఉంటాయి. -
paul alexander: ఇనుప ఊపిరితిత్తి!
ఓ పొడవైన పెట్టె. శరీరమంతా అందులోనే. తల మాత్రమే బయటకు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 72 ఏళ్లు అందులోనే గడిపితే? అమెరికాకు చెందిన పాల్ అలెగ్జాండర్ అలాగే గడిపారు -
గూగుల్ సెర్చ్ తెలివిగా..
స్మార్ట్ఫోన్లలో గూగుల్ సెర్చ్‌ను వాడనివారుండరంటే అతిశయోక్తి కాదు. కానీ తేలికగా, త్వరగా ఆయా అంశాలను శోధించటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయనే సంగతి తెలుసా? అలాంటి కొన్ని ఉపాయాల గురించి తెలుసుకుందాం. -
భళారే డిజిటల్ విచిత్రం!
ఒకప్పటి కన్నా స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల సామర్థ్యం, వేగం పుంజుకున్న మాట నిజం. కానీ ఆకారంలో పెద్దగా మారింది లేదు. ఒకసారి అంచులు చిన్నగా.. మరోసారి కెమెరా బంప్‌లు పెద్దగా ఉండటం తప్పించి దాదాపు అలాగే కనిపిస్తుంటాయి. -
కృత్రిమ మేధ గుండె కాయ
కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎక్కడ చూసినా ఈ పేరే మార్మోగుతోంది. -
ఇక ఏఐ సినిమా!
పదాల కూర్పు ఆధారంగా చిటికెలో ఫొటోలు, చిత్రాలు, సంగీతం, పాటలను పుట్టిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) మరో అడుగు ముందుకేసింది. ఏకంగా వీడియోలనూ సృష్టించే స్థాయికి చేరుకుంది. విప్లవాత్మక ఛాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్ఏఐ సంస్థ కొత్తగా తీసుకొచ్చిన జనరేటివ్ కృత్రిమ మేధ (జెన్ఏఐ) మోడలే దీనికి నిదర్శనం. -
ఈ విశ్వ కిరణాలు..
విశ్వ కిరణాలు.. కాస్మిక్ రేస్. అంతరిక్షం ఆవలి నుంచి దూసుకొచ్చే ఇవి నిరంతరం అతి వేగంగా.. దాదాపు కాంతి వేగంతో సమానంగా విశ్వమంతటా ప్రయాణిస్తుంటాయి. వీటి మీద మొదటి నుంచీ శాస్త్రవేత్తలకు ఎంతో ఆసక్తి. ఎందుకంటే అంతరిక్షంలో పుట్టుకొచ్చిన చోటు, ఢీకొట్టిన వస్తువులను బట్టి ఇవి విశ్వానికి సంబంధించిన ఎన్నో విషయాలను వివరిస్తాయి. -
ప్రేమ శాస్త్రం!
ప్రేమ ఎందుకు పుడుతుందో, ఎవరి మీద పుడుతుందో తెలియదు. ఒకరికి నచ్చిన వ్యక్తి మరొకరికి నచ్చకపోవచ్చు. ఒకరికి అసలే నచ్చనివారు మరొకరికి ప్రాణం కన్నా మిన్నగా అనిపించ్చొచ్చు. -
ఫోల్డర్ మాయలు
విండోస్ పీసీలో రోజూ ఫోల్డర్లను వాడుతూనే ఉంటాం. కొత్త ఫైళ్లను స్టోర్ చేయటం, డేటాను వరుసగా పెట్టుకోవటం.. ఇలా ఎన్నింటికో వీటిని ఉపయో గిస్తుంటాం. మరి అదృశ్య ఫోల్డర్‌ను సృష్టించుకోగలరా? ఒకేసారి బోలెడన్ని ఫోల్డర్ల పేర్లను మార్చుకోగలరా? ఖాళీ ఫోల్డర్లను గుర్తించగలరా? ఇలాంటి కొన్ని చిత్రమైన ఫోల్డర్ చిట్కాల గురించి తెలుసుకుందాం. -
అమెజాన్ అడుగున బంగారు నేల
అమెజాన్ అనగానే దట్టమైన అడవులే గుర్తుకొస్తాయి. మనుషులు దూరటానికి వీల్లేని అక్కడ ఒకప్పుడు పెద్ద పట్టణమే ఉండేదని ఇటీవల తేలటం అందరినీ ఆశ్చర్యపరచింది -
ఏఐ టెక్కులు!
అసలే కృత్రిమ మేధ (ఏఐ) యుగం. ఆపై ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్ వస్తు ప్రదర్శన. ఇక చెప్పేదేముంది? ఏ పరికరాన్ని చూసినా ఏఐమయమే. హెల్త్ ట్రాకర్ల దగ్గరి నుంచి వాహనాల వరకూ అన్నింటికీ అదే ఆలంబన. -
Cyber Crime: నయా సైడర్!
నేటి సైబర్ యుగంలో నేరాలూ మారిపోతున్నాయి. ఆన్లైన్ మోసాలు కోకొల్లలు. డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు చోరీ చేసి మన ప్రమేయమేమీ లేకుండానే నేరగాళ్లు షాపింగ్ చేయటం తెలిసిందే -
కొత్త టెక్ లోకం
డిజిటల్ పరిణామం ఆగేది కాదు. ఇదో నిరంతర ప్రక్రియ. గత ఏడాదిని గతి తిప్పిన ట్రెండ్స్ కొత్త సంవత్సరాన్నీ పరుగులు తీయించనున్నాయి. మెషిన్ ఇంటెలిజెన్స్ జోరందుకోనుంది. వాస్తవ, కాల్పనిక ప్రపంచాల మధ్య హద్దులు చెరగటం ఖాయంగా కనిపిస్తోంటే.. నిరంతర అంతర్జాల పరిణామ ప్రక్రియ మన జీవితాలను గణనీయంగా శాసించేలా రూపుదిద్దుకుంటోంది. -
ఇస్రో ఏఐ వత్సరం 2024
ఇది మనదేశం జాబిల్లిని తాకి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచిన సంవత్సరం.ఇది కృత్రిమ మేధ ప్రయోగశాలలను దాటుకొని నిత్య జీవన వ్యవహారాల్లోకి విరివిగా చొచ్చుకొచ్చిన సంవత్సరం.శాస్త్ర, సాంకేతిక రంగాలు ఒకదాంతో మరోటి పోటీ పడుతూ కొత్త వత్సరంలోకి అడుగిడుతున్న వేళ సాధించిన ఘనతలను సమీక్షించుకోవటం ముదావహం. -
స్థానిక మేధ
కృత్రిమ మేధ (ఏఐ) తీరు మారుతోంది. ఆంగ్లం గడపను దాటుకొని స్థానిక భాషలపై దృష్టి సారిస్తోంది. ఆయా భాషల వైవిధ్యం, యాసలు, సంస్కృతులకు అనుగుణంగా రూపాంతరం చెందుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్‌కు నో ఛాన్స్.. ఈ లఖ్‌నవూ స్టార్‌కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్