జిబ్‌ ట్రూ: సింగిల్‌ ఛార్జ్‌తో రోజంతా మ్యూజిక్‌

కొత్తగా ఏదైనా ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌ కొంటున్నామంటే..ముందుగా చూసేది బ్యాటరీనే. తర్వాతే మిగతా ఫీచర్స్‌ గురించి ఆలోచిస్తాం. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఇయర్‌ఫోన్స్‌‌ తయారీ కంపెనీ స్కల్‌క్యాండీ అధిక బ్యాటరీ లైఫ్‌తో ‘జిబ్‌ ట్రూ’ ట్రూ వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది....

Published : 20 Jan 2021 18:51 IST

ఇంటర్నెట్ డెస్క్‌: కొత్తగా ఏదైనా ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌ కొంటున్నామంటే..ముందుగా చూసేది బ్యాటరీనే. తర్వాతే మిగతా ఫీచర్స్‌ గురించి ఆలోచిస్తాం. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఇయర్‌ఫోన్స్‌‌ తయారీ కంపెనీ స్కల్‌క్యాండీ అధిక బ్యాటరీ లైఫ్‌తో ‘జిబ్‌ ట్రూ’ ట్రూ వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ని (టీడబ్ల్యూఎస్‌) భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వాటర్‌ రెసిస్టెంట్, డ్యూయల్ మైక్రోఫోన్స్‌‌తో యూజర్స్‌ అద్భుతమైన కాలింగ్ అనుభూతిని పొందుతారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వన్‌ప్లస్‌ బడ్స్‌ జెడ్, రెడ్‌మీ ఇయర్‌బడ్స్‌, రియల్‌మీ బడ్స్‌ క్యూలకు పోటీగా స్కల్‌క్యాండీ వీటిని తీసుకొచ్చింది. 

ఇందులో 40ఎంఎం డ్రైవర్స్‌ని ఇస్తున్నారు. వాయిస్‌ కాల్స్‌, సౌండ్‌‌, ట్రాక్‌ ఛేంజ్ కోసం కంట్రోల్స్‌ ఇస్తున్నారు. నాయిస్‌ ఐసోలేషన్ కోసం సిలికాన్‌ టిప్‌ ఉపయోగించారు. ఆండ్రాయిడ్, ఐఫోన్‌లను సపోర్ట్ చేస్తుంది. గూగుల్ అసిస్టెంట్, సిరి వాయిస్‌ అసిస్టెంట్లను వీటితో ఉపయోగించొచ్చు. ఐపీఎక్స్‌ 4 రేటింగ్ ఉంది. దీని వల్ల ఇయర్‌బడ్స్‌ చెమటకు, నీటిలో తడిచినా పాడవకుండా పనిచేస్తాయి. రెండు ఇయర్‌బడ్స్‌ని ఉపయోగించకూడదనుకుంటే ఒక బడ్‌ని ఉపయోగించేలా వీటిని డిజైన్‌ చేశారు. దాని వల్ల బ్యాటరీ కూడా ఆదా అవుతుంది. జిబ్‌ ట్రూ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఇయర్‌బడ్స్‌ ఆరు గంటలు, ఛార్జింగ్ కేస్‌ 16 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తాయి. మొత్తం 22 గంటల పాటు ఛార్జింగ్‌ను అందిస్తాయి. వీటి ధర రూ. 2,999. బ్లూ, బ్లాక్‌ రంగుల్లో లభిస్తున్నాయి. 

ఇవీ చదవండి..

CES 2021: కరోనా స్పెషల్‌గా ఇవీ

ఫొటోలపై వాటర్‌మార్క్‌.. వేసుకోండిలా..! 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని