Hyderabad: జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసు.. పోలీసుల కీలక నిర్ణయం?

జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే

Updated : 09 Jun 2022 15:15 IST

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిందితులైన ఐదుగురు మైనర్లను విచారణ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జూబ్లీహిల్స్ పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్డును కోరే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్రస్థాయి నేరాలకు పాల్పడిన మైనర్లను చట్ట ప్రకారం మేజర్లుగా పరిగణించవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు 2015లో జువైనల్ జస్టిస్ చట్టానికి చేసిన చట్ట సవరణను జువైనల్ జస్టిస్ బోర్డు దృష్టికి తీసుకెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు.

2019లో చాంద్రాయణగుట్టలో పదేళ్ల బాలుడిపై అసహజ లైంగిక దాడి చేసిన 17 ఏళ్ల బాలుడికి జువైనల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో తీవ్ర నేరానికి పాల్పడిన దృష్ట్యా 17ఏళ్ల బాలుడికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. అదే తరహాలో జూబ్లీహిల్స్‌లో బాలికపై మైనర్లు అత్యాచారానికి పాల్పడటం పోలీసులు తీవ్ర నేరంగా పరిగణిస్తున్నారు. బాలికను మభ్యపెట్టి, భయాందోళనలకు గురి చేసి సామూహిక అత్యాచారం చేసినట్లు పోలీసులు విచారణలో తేలిన విషయం తెలిసిందే. తాము చేసేది నేరమని తెలిసీ నిందితులు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అభియోగపత్రం దాఖలు చేసే సమయంలో నిందితులైన మైనర్లను మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డును కోరాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు న్యాయ సలహా తీసుకుంటున్నట్లు సమాచారం.

నిర్ణయాన్ని స్వాగతించిన మంత్రి కేటీఆర్‌..

అత్యాచారం కేసులో మైనర్లను కూడా మేజర్లుగా పరిగణించి విచారణ జరపాలని కోర్టును కోరాలన్న పోలీసుల నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. పెద్దల తరహాలో అత్యాచారం వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడినప్పుడు జువైనల్‌గా పరిగణించకుండా.. కచ్చితంగా మేజర్లుగానే శిక్షించాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. పోలీసుల వైఖరికి పూర్తి మద్దుతునిస్తున్నట్లు కేటీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని