Hyderabad: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. పోలీసుల కీలక నిర్ణయం?
జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిందితులైన ఐదుగురు మైనర్లను విచారణ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జూబ్లీహిల్స్ పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్డును కోరే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్రస్థాయి నేరాలకు పాల్పడిన మైనర్లను చట్ట ప్రకారం మేజర్లుగా పరిగణించవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు 2015లో జువైనల్ జస్టిస్ చట్టానికి చేసిన చట్ట సవరణను జువైనల్ జస్టిస్ బోర్డు దృష్టికి తీసుకెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు.
2019లో చాంద్రాయణగుట్టలో పదేళ్ల బాలుడిపై అసహజ లైంగిక దాడి చేసిన 17 ఏళ్ల బాలుడికి జువైనల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో తీవ్ర నేరానికి పాల్పడిన దృష్ట్యా 17ఏళ్ల బాలుడికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. అదే తరహాలో జూబ్లీహిల్స్‌లో బాలికపై మైనర్లు అత్యాచారానికి పాల్పడటం పోలీసులు తీవ్ర నేరంగా పరిగణిస్తున్నారు. బాలికను మభ్యపెట్టి, భయాందోళనలకు గురి చేసి సామూహిక అత్యాచారం చేసినట్లు పోలీసులు విచారణలో తేలిన విషయం తెలిసిందే. తాము చేసేది నేరమని తెలిసీ నిందితులు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అభియోగపత్రం దాఖలు చేసే సమయంలో నిందితులైన మైనర్లను మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డును కోరాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు న్యాయ సలహా తీసుకుంటున్నట్లు సమాచారం.
నిర్ణయాన్ని స్వాగతించిన మంత్రి కేటీఆర్..
అత్యాచారం కేసులో మైనర్లను కూడా మేజర్లుగా పరిగణించి విచారణ జరపాలని కోర్టును కోరాలన్న పోలీసుల నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. పెద్దల తరహాలో అత్యాచారం వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడినప్పుడు జువైనల్‌గా పరిగణించకుండా.. కచ్చితంగా మేజర్లుగానే శిక్షించాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. పోలీసుల వైఖరికి పూర్తి మద్దుతునిస్తున్నట్లు కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరిని హత్య చేసిన మావోయిస్టులు
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. వరుస ఎదురుదెబ్బలతో సతమతమవుతున్న మావోయిస్టులు బీజాపూర్ జిల్లాలోని తర్రెమ్ పోలీసుస్టేషన్ పరిధిలోని చుత్వాహి గ్రామానికి చెందిన సోదరులు మండవి జోగ(45), మండవి హుంగా(43)ను దారుణంగా హత్య చేశారు. -
ఫోన్ ట్యాప్ చేశారని ఫిర్యాదు
తమ సెల్ఫోన్లను ట్యాప్ చేశారని హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని ద్వారకా తిరుమల కాలనీకి చెందిన ఇ.విజయపాల్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీపీ టి.కృపాకర్ (ప్రస్తుతం కాజీపేటలో రైల్వే డీఎస్పీ), విశ్రాంత సీఐ దాసరి భూమయ్యలపై కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ జిల్లా జమ్మికుంట సీఐ వి.రవి గురువారం తెలిపారు. -
పంట వ్యర్థాలకు నిప్పు.. మంటల ధాటికి రైతు బలి
వానాకాలం సాగుకు పొలాన్ని సిద్ధం చేయడానికి మొక్కజొన్న, పత్తి పంట వ్యర్థాలకు నిప్పు పెట్టిన రైతు.. మంటల వేడి, పొగ కారణంగా తనూ మృతి చెందిన విషాదకర సంఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకొంది. -
చెత్త కుప్పల మంటల్లో పడి కూలీ మృతి
తగలబడుతున్న చెత్తలో పడి ఓ నిర్మాణ కార్మికుడు సజీవ దహనం అయ్యాడు. రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన దొంపక బాబు(35) భార్య సంధ్యతో కలిసి రాయదుర్గం పరిధిలోని అంజయ్యనగర్‌లో ఉండేవాడు. -
ఎంత డబ్బో.. ఎవరి సొమ్మో!
ఎన్నికల నిబంధనల వేళ ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ.2.40కోట్ల నగదును పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. -
వైకాపా సర్పంచి వాహనంలో ‘ఎన్నికల’ మద్యం పట్టివేత
వైకాపాకు చెందిన గ్రామ సర్పంచి వాహనంలో మద్యం సీసాలు పట్టుబడ్డాయి. అధికారుల వివరాల మేరకు.. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల శివారులోని పల్నాడు బార్ అండ్ రెస్టారెంటులో గురజాల నియోజకవర్గం వీరాపురం గ్రామానికి చెందిన వైకాపా సర్పంచి సుంకర విజయరామారావు, కేసనపల్లి గ్రామానికి చెందిన గణేష్‌బాబు 1,056 మద్యం సీసాలు కొనుగోలు చేసి, వాహనంలో తీసుకెళ్తున్నారు. -
హోమియోపతి మందులతో నకిలీ మద్యం తయారీ
విశాఖ నగరంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి మద్యం తయారీకి వాడుతున్న రసాయనాలు, లేబుళ్లు, సీసాలను స్వాధీనం చేసుకున్నారు. -
గుంటూరులో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్
గుంటూరులోని నెహ్రూనగర్ ప్రాంతంలో గురువారం రాత్రి గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. అడ్డొచ్చిన వారిని కొడుతూ బీభత్సం సృష్టించింది. మహిళలు, వృద్ధులనీ చూడకుండా మత్తులో ఉన్న 15 మంది దాడులకు తెగబడ్డారు. -
తెనాలిలో వైకాపా రౌడీషీటర్ అరాచకం
గుంటూరు జిల్లా తెనాలిలో వైకాపా రౌడీషీటర్ ఇద్దరిని కొట్టాడు. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు.. రెండో పట్టణ పోలీసుస్టేషన్లో ఏ ప్లస్ రౌడీషీటర్‌గా ఉన్న సముద్రాల పవన్‌కుమార్ అలియాస్ లడ్డూ తన మిత్రుడితో కలిసి ఐతానగర్లో బుధవారం బైకుపై వెళుతుండగా మరో ద్విచక్రవాహనదారుడు వీరికి తగిలారు. -
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవం ఖరారు
అనంతపురానికి చెందిన గంగుల సూర్యనారాయణరెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడైన మలిశెట్టి భానుకిరణ్ అలియాస్ భానుకు కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను ఖరారు చేస్తూ గురువారం హైకోర్టు తీర్పు వెలువరించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్‌డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్