పేదలకు అభయం.. తితిదే ‘కల్యాణమస్తు’

పేదలకు సామూహిక వివాహాలు జరిపించేందుకు కల్యాణమస్తు కార్యక్రమాన్ని తితిదే మరోమారు అందుబాటులోకి తెచ్చింది. 2011లో ఆగిపోయిన ఈ కార్యక్రమాన్ని తిరిగి 11 ఏళ్ల

Published : 25 Jun 2022 05:32 IST

1 నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రారంభం

తిరుమల, న్యూస్‌టుడే: పేదలకు సామూహిక వివాహాలు జరిపించేందుకు కల్యాణమస్తు కార్యక్రమాన్ని తితిదే మరోమారు అందుబాటులోకి తెచ్చింది. 2011లో ఆగిపోయిన ఈ కార్యక్రమాన్ని తిరిగి 11 ఏళ్ల తర్వాత ప్రారంభించేందుకు తితిదే సిద్ధమైంది. కల్యాణమస్తులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఆగస్టు 7న ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించనున్నారు. వధూవరులకు 2 గ్రాముల బంగారు తాళిబొట్టు, వెండి మెట్టెలు, పెండ్లి వస్త్రాలు, వధువు తరఫున 20 మంది, వరుడు తరఫున 20 మందికి ఉచిత భోజన సదుపాయం కల్పించనున్నారు. జులై 1 నుంచి 20వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో కల్యాణమస్తు రిజిస్ట్రేషన్‌ కార్యక్రమం జరగనుంది. తితిదే నుంచి ప్రతి జిల్లా కేంద్రానికి ఒక కోఆర్డినేటర్‌ను నియమించి కలెక్టర్‌, జేసీ, ఆర్డీవోలతో తోడ్పాటుతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కల్యాణమస్తులో వివాహాలు చేసుకోవాలనుకునే అర్హులు జిల్లా కలెక్టర్‌, ఆర్డీవో, తహసీల్దారు కార్యాలయాల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని