‘చలో ప్రగతిభవన్‌’లో ఉద్రిక్తత

రాష్ట్రంలోని పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ చేపట్టిన ‘చలో ప్రగతిభవన్‌’ ఉద్రిక్తతకు దారితీసింది. నిరసన విషయం తెలుసుకున్న పోలీసులు

Published : 05 Jul 2022 05:52 IST

పోడు భూములకు హక్కులు కల్పించాలంటూ సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నిరసన

సోమాజిగూడ, నల్లకుంట, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ చేపట్టిన ‘చలో ప్రగతిభవన్‌’ ఉద్రిక్తతకు దారితీసింది. నిరసన విషయం తెలుసుకున్న పోలీసులు విద్యానగర్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం మార్క్స్‌ భవన్‌ను చుట్టుముట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రదర్శన చేపట్టిన చాలామందిని అరెస్టు చేసి ఠాణాలకు తరలించారు. అయితే, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆందోళనకారుల్లో పలువురు సోమాజిగూడ మీదుగా ప్రగతిభవన్‌ వైపు పరుగుపెట్టారు. వారిని పోలీసులు నిలువరించే క్రమంలో తోపులాట చోటుచేసుకుంది. ఎట్టకేలకు వారందరినీ వాహనాల్లో ఎక్కించి గోషామహల్‌ స్టేడియానికి తరలించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ రాష్ట్ర సెక్రటేరియట్‌ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య, జేవీ చలపతిరావు, మధు, ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి జనార్దన్‌ తదితరులు మాట్లాడుతూ.. హక్కు పత్రాల కోసం సీఎంకు వినతిపత్రం ఇవ్వాలని వస్తే అప్రజాస్వామికంగా అరెస్టు చేశారని మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని