Agnipath: నేటి నుంచి ‘అగ్నిపథ్‌’ దరఖాస్తుల స్వీకరణ

అగ్నిపథ్‌ పథకంలో భాగంగా ఆర్మీలో చేరేందుకు శుక్రవారం నుంచి సెప్టెంబరు 3 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సికింద్రాబాద్‌ ఆర్మీ అధికారులు గురువారం ప్రకటించారు. 

Updated : 12 Oct 2022 11:44 IST

సూర్యాపేట నేరవిభాగం, న్యూస్‌టుడే: అగ్నిపథ్‌ పథకంలో భాగంగా ఆర్మీలో చేరేందుకు శుక్రవారం నుంచి సెప్టెంబరు 3 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సికింద్రాబాద్‌ ఆర్మీ అధికారులు గురువారం ప్రకటించారు. www.joinindianarmy.nic.in  వెబ్‌సైట్‌ నుంచి మాత్రమే దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. అక్టోబరు 1 నాటికి 23 ఏళ్ల వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, టెక్నికల్‌, క్లర్క్‌/స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌ విభాగంలో పదోతరగతి ఉత్తీర్ణత, అగ్నివీర్‌ ట్రేడ్స్‌మెన్‌కు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలన్నారు. ఇందులో భాగంగా భారత సైన్యం ఈ ఏడాది అక్టోబరు 15 నుంచి 31 వరకు సూర్యాపేటలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల మైదానంలో అగ్నిపథ్‌ పథకం కింద రిక్రూట్‌మెంట్‌ ర్యాలీని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని