ఆర్టీసీ ఉద్యోగులకు ఒక డీఏ చెల్లిస్తాం: ఛైర్మన్‌

‘ఆర్టీసీ ఉద్యోగులకు సెప్టెంబరు జీతంతో కలిపి ఒక నెల డీఏ బకాయి చెల్లిస్తాం. వారికి చెల్లించాల్సిన బకాయిల్లో సుమారు రూ.వెయ్యి కోట్ల వరకు త్వరలో చెల్లించేందుకు చర్యలు తీసుకుంటాం.

Published : 16 Aug 2022 05:37 IST

ఈనాడు, హైదరాబాద్‌: ‘ఆర్టీసీ ఉద్యోగులకు సెప్టెంబరు జీతంతో కలిపి ఒక నెల డీఏ బకాయి చెల్లిస్తాం. వారికి చెల్లించాల్సిన బకాయిల్లో సుమారు రూ.వెయ్యి కోట్ల వరకు త్వరలో చెల్లించేందుకు చర్యలు తీసుకుంటాం. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి ఇతర బకాయిల్లోని కొంత మొత్తాన్ని కూడా చెల్లిస్తాం’ అని తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ సోమవారం ప్రకటించారు. ‘ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి ముఖ్యమంత్రికి పూర్తిగా తెలుసు. ఉద్యోగులకు బకాయిలను చెల్లించేందుకు కసరత్తు చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి కనీసం రూ.వెయ్యి కోట్ల వరకు సాయం అందుతుందని ఆశాభావంతో ఉన్నాం. జీవా పేరుతో మంచినీటి సీసాలను అందుబాటులోకి తీసుకురానున్నాం. త్వరలో మరో 300 విద్యుత్తు బస్సులు అందుబాటులోకి రానున్నాయి. రాఖీ సందర్భంగా ఒక్క రోజు రూ. 20 కోట్ల ఆదాయం లభించటం ప్రోత్సాహకరంగా ఉంది’ అని గోవర్ధన్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని