ఎమ్మెల్యే భూ ఆక్రమణపై చర్యలు తీసుకోండి

హైదరాబాద్‌లోని యాకుత్‌పురకు చెందిన అజీజ్‌జిలానీ కుటుంబానికి అల్వాల్‌ ప్రాంతంలో ఉన్న 6.04ఎకరాల భూమిని ఓ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఆక్రమించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల వేదిక సీఎం కేసీఆర్‌ను

Published : 17 Aug 2022 05:49 IST

ముఖ్యమంత్రికి మానవ హక్కుల వేదిక లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని యాకుత్‌పురకు చెందిన అజీజ్‌జిలానీ కుటుంబానికి అల్వాల్‌ ప్రాంతంలో ఉన్న 6.04ఎకరాల భూమిని ఓ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఆక్రమించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల వేదిక సీఎం కేసీఆర్‌ను కోరింది. వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జి.మాధవరావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఎస్‌.తిరుపతయ్య, తెలుగు రాష్ట్రాల సమన్వయ కమిటీ ప్రతినిధి ఎస్‌.జీవన్‌కుమార్‌ ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ‘మేడ్చల్‌జిల్లా అల్వాల్‌ మండలం పాలకుంటలోని 3 సర్వే నంబర్లలో జిలానీ కుటుంబానికి పూర్వీకుల ఇచ్చిన భూమిఉంది. ధరణిలోనూ సాగు భూమిగా నమోదైంది. 2021లో ఓహౌసింగ్‌ సొసైటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఒక ఎమ్మెల్యే, అతని అనుచరులు తిరిగి ఆ భూముల్లోకి ప్రవేశించారు. ఈ భూములపై కోర్టుల్లో వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉండగానే నిర్మాణాలకు దిగుతున్నారు. ఈ సమస్యపై విచారణకు ఆదేశించి జిలానీ కుటుంబానికి ఉన్న హక్కుల రక్షణకు సీఎం చర్యలు చేపట్టాలి’అని లేఖలో మానవ హక్కుల వేదిక కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని