శిఖరాగ్రంపై కార్తికేయ

హైదరాబాద్‌కు చెందిన పడకంటి విశ్వనాథ్‌ కార్తికేయ (13) ఐరోపాలో అత్యంత ఎత్తయిన మౌంట్‌ ఎల్‌బ్రస్‌ పర్వతం తూర్పు, పడమర శిఖరాలను 24 గంటల వ్యవధిలో అధిరోహించాడు. ఎల్‌బ్రస్‌ పర్వతం పశ్చిమభాగం 5,642

Published : 18 Aug 2022 04:56 IST

మౌంట్‌ ఎల్‌బ్రస్‌ను అధిరోహించిన 13 ఏళ్ల బాలుడు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన పడకంటి విశ్వనాథ్‌ కార్తికేయ (13) ఐరోపాలో అత్యంత ఎత్తయిన మౌంట్‌ ఎల్‌బ్రస్‌ పర్వతం తూర్పు, పడమర శిఖరాలను 24 గంటల వ్యవధిలో అధిరోహించాడు. ఎల్‌బ్రస్‌ పర్వతం పశ్చిమభాగం 5,642 మీటర్లు, తూర్పు శిఖరం 5,621 మీటర్ల ఎత్తు ఉంటాయి. ‘ఆగస్టు 8వ తేదీన రష్యాకు వెళ్లిన కార్తికేయ 15 ఉదయం 5.30 గంటలకు పర్వత పడమర శిఖరాగ్రానికి చేరుకున్నాడు. అదేరోజు అక్కణ్నుంచి ప్రారంభమై 16వతేదీ తెల్లవారుజామున 4.30 గంటలకు తూర్పు శిఖరం చేరుకున్నాడని’ బాలుడి తల్లిదండ్రులు రాజేంద్రప్రసాద్‌, లక్ష్మి వెల్లడించారు. తమ కుమారుడు గత జులైలోనే లద్దాఖ్‌లో గడ్డకట్టే చలిలో 6,270 మీటర్ల ఎత్తులోని కాంగ్‌ యాట్సే పర్వతాన్ని అధిరోహించాడని, అక్కణ్నుంచి క్రాంపాస్‌ బేస్‌ పాయింట్‌ మీదుగా 6,240 మీటర్ల ఎత్తులోని ద్జోజోంగో పర్వత శిఖరాగ్రానికి చేరుకుని రికార్డు నెలకొల్పాడని తెలిపారు. కార్తికేయ సికింద్రాబాద్‌లోని ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని