విశ్వనగర సూచిక.. ఆత్మగౌరవ వేదిక

హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై నిలిపి ఉంచిన ఈ బస్సు నగరంలో మహిళల కోసం ఏర్పాటు చేసిన సంచార మరుగుదొడ్డి. సేఫ్‌ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఇలాంటి 12

Published : 26 Sep 2022 04:10 IST

హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై నిలిపి ఉంచిన ఈ బస్సు నగరంలో మహిళల కోసం ఏర్పాటు చేసిన సంచార మరుగుదొడ్డి. సేఫ్‌ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఇలాంటి 12 బస్సులను గ్రేటర్‌ హైదరాబాద్‌లో అందుబాటులోకి తెచ్చారు. జన సమూహం అధికంగా ఉండే, పర్యాటక, ఉత్సవాలు జరిగే ప్రాంతాల్లో అందుబాటులో ఉంచనున్నారు. బస్సుపైన వెయ్యి లీటర్ల నీటి ట్యాంక్‌ ఉంటుంది. లోపల నాలుగు మరుగుదొడ్లు, చిన్నారులకు పాలిచ్చే గది, ప్రథమ చికిత్స సదుపాయాలున్నాయి. షీటీమ్స్‌ సహకారంతో జీహెచ్‌ఎంసీ ఈ బస్సులను పర్యవేక్షిస్తోంది. ఈ ఆధునిక బస్సులు వీఐపీల కోసమేనేమో అనే అనుమానంతో సాధారణ మహిళలు ఉపయోగించడానికి జంకుతుండడంతో బస్సు సిబ్బంది అక్కడి మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు.

- ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని