టీఎస్‌యూ దీక్ష భగ్నం

చర్లగూడెం జలాశయం భూనిర్వాసితులకు మద్దతుగా తెలంగాణ స్టూడెంట్‌ యూనియన్‌(టీఎస్‌యూ) ఆధ్వర్యంలో గురువారం మునుగోడులో తలపెట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలంలో నిర్మిస్తున్న జలాశయం

Published : 30 Sep 2022 04:09 IST

‘చర్లగూడెం’ భూనిర్వాసితుల అడ్డగింత

మునుగోడు, చండూరు, న్యూస్‌టుడే: చర్లగూడెం జలాశయం భూనిర్వాసితులకు మద్దతుగా తెలంగాణ స్టూడెంట్‌ యూనియన్‌(టీఎస్‌యూ) ఆధ్వర్యంలో గురువారం మునుగోడులో తలపెట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలంలో నిర్మిస్తున్న జలాశయం భూనిర్వాసితులు నష్టపరిహారం, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ నెల రోజులుగా తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరాహార దీక్షలు చేస్తున్నారు. వారికి మద్దతుగా దీక్షకు టీఎస్‌యూ పిలుపునిచ్చింది. మునుగోడులోని అంబేడ్కర్‌ చౌరస్తాకు చేరుకున్న సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నల్గొండ అంజితో పాటు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని తొలుత మునుగోడు ఠాణాకు, అనంతరం నల్గొండకు తరలించారు. చర్లగూడెం, నర్సిరెడ్డిగూడెం, వెంకపల్లి, శివన్నగూడెం, రాంరెడ్డిపల్లి, ఖుదాభక్షిపల్లి గ్రామాల భూనిర్వాసితులు వాహనాల్లో మునుగోడుకు బయలుదేరగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. కొందర్ని చండూరు ఠాణాకు తరలించారు. మిగిలినవారు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వీరికి కాంగ్రెస్‌ నాయకుడు చెరుకు సుధాకర్‌ మద్దతు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని